ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా నిన్నటితో లీగ్ మ్యాచ్ లు అన్నీ ముగిసాయి. దానితో ప్లే ఆప్స్ లోకి వెళ్లబోయేది ఎవరు? ఎవరు ఎవరితో మ్యాచ్ లు ఆడబోతున్నారు. ప్రస్తుతం టాప్ 4 ప్లేసెస్ లో ఎవరు ఉన్నారు అని అన్ని విషయాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే ఐ పీ ఎల్ లో టాప్ 2 ప్లేసెస్ లో నిలిచిన రెండు జట్లు మొదట తలబడతాయి. ఇక ఆ తర్వాత మూడు , నాలుగు స్థానాలలో ఉన్న జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లలో ఏ జట్టు అయితే గెలుస్తుందో ఆ జట్టు నేరుగా ఫైనల్ లోకి వెళుతుంది.

ఇక మూడు , నాలుగు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య మ్యాచ్ జరగగా అందులో ఓడిపోయిన జట్టు నేరుగా ఎలిమినేట్ అవుతుంది. గెలిసిన జట్టు ఒకటి , రెండు స్థానాల్లో ఉన్న టీమ్ లలో ఓడిపోయిన జట్టుతో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు అయితే గెలుస్తారో వారు ఫైనల్ కు చేరుతారు. ఇక ఈ సారి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ నిలవగా , రెండవ స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ , మూడవ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ , నాలుగవ స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు నిలిచాయి.

ఇందులో భాగంగా రేపటి నుండి నాకౌట్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఇందులో మొదటగా కోల్కతా , హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన వారు నేరుగా ఫైనల్ కి వెళ్తారు. ఆ తర్వాత రాజస్థాన్ , బెంగళూరు తలపడనున్నాయి. ఇందులో ఓడినవారు సీజన్ నుండి నిష్క్రమించగా , గెలిచినవారు మొదటి మ్యాచ్ లో ఓడిన వారితో తలబడతారు. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వారు ఫైనల్ కి వెళ్తారు. దానితో ఇక పై జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో కీలకంగా ఉండబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl