ఎన్నో రోజుల నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అలరిస్తూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎన్నో రోజుల ఉత్కంఠకు మరికొన్ని రోజుల్లో తెరపడబోతుంది. ఈ సీజన్లో ఐపిఎల్ టైటిల్ విజేతగా నిలవబోయే జట్టు ఏది అనే విషయంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రాబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తెలుసుకునేందుకు అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.


 కాగా ఇటీవలే నాకౌట్ మ్యాచ్లు కూడా ప్రారంభమయ్యాయి. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇరు జట్లు కూడా ప్రతి మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఇక ఇలా ప్లే ఆప్స్ లో అర్హత సాధించాయి. ఈ క్రమంలోనే ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. అయితే గుజరాత్ వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించింది. ఈ క్రమంలోనే నేరుగా ఫైనల్ అడుగు పెట్టేసింది అని చెప్పాలి.


 శ్రేయస్ అయ్యర్ కీలకమైన మ్యాచ్లో మరోసారి తన కెప్టెన్సీ తో ఆకట్టుకున్నాడు. కోల్కతా జట్టును అటు ఫైనల్ లో నిలబెట్టడంలో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. అయితే శ్రేయస్ అయ్యర్ ఇలా కోల్కతా జట్టును ఫైనల్ లో చేర్పించడం ద్వారా ఒక అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లను ఫైనల్ కు చేర్చిన తొలి కెప్టెన్గా అయ్యర్ చరిత్ర సృష్టించాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ 2024 లో కోల్కతా నైట్ రైడర్స్ ను ఆయన ఫైనల్ కు తీసుకు వెళ్లారు. ఐపీఎల్  చరిత్రలో మరో కెప్టెన్ రెండు జట్లను ఫైనల్ కు చేర్చలేదు. అయితే ఈ సీజన్ అయ్యర్ నిలకడగా రాణిస్తూ 345 పరుగులు చేశాడు.. ఇప్పటివరకు ఐదు సార్లు టైటిల్స్ అందించిన కెప్టెన్ లుగా ఉన్న రోహిత్, ధోనీలకు సైతం ఈ రికార్డు సాధ్యం కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: