ఎన్నో రోజుల నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అలరిస్తూ వస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే లీగ్ మ్యాచ్లు ముగియగా.. ప్రస్తుతం నాకౌట్ మ్యాచ్ లు జరుగుతున్నాయ్. అయితే ఈ నాకౌట్ మ్యాచ్లలో భాగంగా.. ఇటీవలే పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలలో కొనసాగిన అటు కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్కతా జట్టు విజయం సాధించి నేరుగా ఫైనల్ కు దూసుకువెళ్లి అన్న విషయం తెలిసిందే. అయితే నేడు ఐపీఎల్లో మరో కీలక మ్యాచ్ కి సమయం ఆసన్నమైంది.


 పాయింట్ల పట్టికలో మూడు నాలుగు స్థానాలలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించబోయేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అహ్మదాబాద్ లోని మోడీ స్టేడియంలో మరికాసేపట్లోనే ఇక ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ ఫై భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఎదురుచూస్తున్నారు   ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో వరుసపరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరన కొనసాగిన ఆర్సిబి ఆ తర్వాత పుంజుకుని  వరుస విజయాలతో ప్లే ఆఫ్ కి అర్హత సాధించింది. ఇక ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్లో ఎలా రానించబోతుంది అనే దాని పైన అందరూ దృష్ట ఉంది.


 అయితే మరికొన్ని నిమిషాలలో అటు ఎలిమినేటర్ మ్యాచ్ ప్రారంభం కాబోతుండగా.. విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు ఉంది అనే వార్త కోహ్లీ అభిమానులు అందరిలో కూడా ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలోనే కోహ్లీకి  ముప్పు ఉండడంతో స్టేడియం వద్ద భద్రతను పెంచారు. ఇటీవల ఆర్సిబి ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దు చేసినట్లు సమాచారం. అయితే మొన్న అహ్మదాబాద్ విమానాశ్రయంలో 4గురూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పట్టుబడటంతో  కోహ్లీ భవితకు ముప్పు ఉన్నట్టు తెలుస్తుంది. స్టేడియానికి 5000 మంది పోలీసు.. లువెయ్యి మంది ప్రైవేట్ సిబ్బందితో ఇక సెక్యూరిటీని కల్పిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మ్యాచ్ ప్రశాంతంగా జరగాలని అటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: