ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లోనే మోస్ట్ అన్ లక్కీ టీం గా కొనసాగుతుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఎందుకంటే మహా మహా ప్లేయర్స్ కలిగిన ఈ జట్టు ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ప్రతిసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ అభిమానులు అందరిని కూడా నిరాశ పరుస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఫైనల్ కు వెళ్లి చివరికి తుది అడుగులో కూడా ఓడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తప్పకుండా టైటిల్  గెలుస్తుందని అభిమానులు గట్టిగా నమ్మారు.


 ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు మహిళల జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో ఐపీఎల్ లో కూడా ఈసారి పురుషుల జట్టు టైటిల్ గెలవడం ఖాయమని అభిమానులు అందరూ అంచనాలు పెట్టుకున్నారు. ఇక అందుకు తగ్గట్లుగానే ఆర్సిబి ప్రస్థానం కొనసాగింది. మొదట్లో వరుసగా పరాజయాలతో సతమతమైన ఆర్సిబి అనూహ్యంగా విజయాల బాట పట్టింది. దీంతో కనీసం ప్లే ఆఫ్ లో అడుగుపెడుతుందా లేదా అనే దశ నుంచి ఇక టాప్ ఫోర్ లో నిలిచి ఇక నాకౌట్ మ్యాచ్లు ఆడెందుకు అర్హత సాధించింది.


 ఇదంతా చూసి ఈసారి ఆర్సిబి జట్టు కప్పు గెలవడం ఖాయం అంటూ అటూ అభిమానులు అందరూ కూడా భీమా వ్యక్తం చేశారు. కానీ ఇటీవల ఎలిమినేటర్ మ్యాచ్ లో చివరికి రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు   అయితే ఈ ఓటమి ద్వారా మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది ఆర్సిబి. ప్లే ఆఫ్ లో అత్యధిక సార్లు వెనుదిరిగిన జట్టుగా చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. 16 మ్యాచ్లలో పది సార్లు ఓడిపోయింది ఆర్సిబి.  ఇక తర్వాత స్థానాలలో సీఎస్కే 26 మ్యాచ్లలో ఆరు ఓటములు, ఢిల్లీ 11 మ్యాచ్లలో 9 పరాజయాలు, ముంబై 20 మ్యాచ్లలో 7 ఓటములు, సన్రైజర్స్ 12 మ్యాచ్లలో 7 ఓటములతొ తర్వాత స్థానాలలో ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb