టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని ఇక ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు అంటూ ఈ ఐపిఎల్ ప్రారంభం కాకముందు నుంచే ఎన్నో వార్తలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం జరిగింది. అయితే ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కప్పు గెలిచి ధోనీకి ఒక మంచి బహుమతి ఇస్తుందని అందరూ అనుకుంటే కీలకమైన మ్యాచ్ లలో ఓడిపోయింది.


 దీంతో కనీసం ప్లే ఆఫ్ లో కూడా అడుగుపెట్టకుండానే.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక వచ్చే సీజన్లో ధోని ఐపీఎల్ ఆడబోడు అంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అయితే ఇక ధోని ఐపిఎల్ ఆడక పోతే అతని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనే విషయం గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో మహేంద్ర సింగ్ ధోని ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కాస్త సంచలనంగా మారిపోయింది. సాదరణంగానే ధోని సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు.


 అలాంటి మహేంద్ర సింగ్ ధోని ఇటీవల ఏకంగా తన ఫేస్బుక్ ఖాతాలో ఏకంగా మూడు వ్యాఖ్యలను పోస్ట్ చేయడం సంచలనగా మారింది. ఇక ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన సమయం. ముఖ్యమైన పనులు చేయడానికి ఇది అనువైన సమయం నేను. నా సొంత జట్టును ప్రారంభిస్తున్నాను అని ధోని రాసుకోచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ధోని ఏ ఉద్దేశంతో ఈ పోస్టును షేర్ చేశాడు. ధోని కొత్త జట్టు ఏది.. ఆ జట్టు క్రికెట్ కు సంబంధం  ఉంటుందా లేకపోతే ధోని మాటలు వెనక ఇంకా ఏదైనా అర్థం ఉందా అనే విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే గతంలోనే ధోని తీసుకున్న పలు నిర్ణయాలు ఆశ్చర్యానికి గురిచేసాయి. ఇక ఇప్పుడు కూడా ధోనీ ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: