ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024) చిట్ట చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే నాకౌట్ మ్యాచులు కూడా మొదలు అయ్యాయి. అందులో భాగంగా ఈ సీజన్ లో మొదటి ఒకటి , రెండు స్థానాలలో నిలిచినటువంటి కోల్కతా మరియు హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగగా ఇందులో కోల్కతా గెలిచి ఇప్పటికే ఫైనల్ లోకి వెళ్లిపోయింది. ఇక మూడవ , నాలుగవ స్థానాలలో ఉన్న రాజస్థాన్ , బెంగళూరు మధ్య మ్యాచ్ జరగగా బెంగుళూరు ఓడిపోయి ఇంటికి వెళ్లిపోయింది.

ఇక ఈ సీజన్ లో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ కి బెంగళూరు తో గెలిచిన రాజస్థాన్ కి ఇవాళ సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్ కు వెళతారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో వర్షాలు పడి చాలా మ్యాచులు మధ్య లోనే ఆగిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ఈ రోజు మ్యాచ్ లో కూడా వర్షం పడితే ఎలాంటి రిజల్ట్ ఉండబోతుంది అనే ఆసక్తి జనాలలో నెలకొంది. ఒక వేళ ఈ రోజు కనుక మ్యాచ్ వర్షం పడి రద్దు అయినట్లు అయితే రేపు రిజర్వు డే ఉండడంతో ఈ రోజు మ్యాచ్ ను రేపు కంటిన్యూ చేస్తారు.

ఒక వేళ రేపు కూడా వర్షం పడి ఈ మ్యాచ్ ఆగిపోయినట్లు అయితే ఏం చేస్తారు అనే అనుమానాలు కూడా కొంత మంది లో రేకత్తుతాయి. ఒక వేళ రేపు కూడా మ్యాచ్ వర్షం పడి రద్దు అయినట్లయితే లీగ్ దశలో పాయింట్లు పట్టిక లో ఎవరు అయితే ముందు స్థానంలో ఉన్నారో వారు ఫైనల్ కు వెళతారు. దానిని బట్టి చూసినట్లు అయితే ఇవాళ , రేపు వర్షం పడి మ్యాచ్ రద్దు అయినట్లు అయితే లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలో ఉన్న హైదరాబాద్ జట్టు ఫైనల్ లోకి వెళుతుంది. మరి రాజస్థాన్ , హైదరాబాద్ ల మధ్య మ్యాచ్ ఎలా ఉంటుంది. ఎవరు గెలుస్తారు. వర్షం పడి రద్దు అవుతుందా ..? ఇలాంటివన్నీ తెలియాలి అంటే కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl