ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) అంటేనే భారీ స్కోర్లు. ఆటగాళ్లు ప్రతి మ్యాచ్ లోను ఎక్కువ స్కోరులను రప్పించడానికి తమ వంతు కృషి చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పటికే చాలా మ్యాచ్ లలో భారీ స్కోర్ లు కూడా నమోదు అయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోర్ ను నమోదు చేసినట్లు అయితే దానిని తర్వాత బ్యాటింగ్ చేసే టీం అధిగమించినట్లు అయితే ఆ మ్యాచ్ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వస్తూ ఉంటుంది.

ఇకపోతే ఐపీఎల్ మ్యాచ్ లలో ప్రధానంగా డెత్ ఓవర్ లపై ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే 17 నుండి 20 ఓవర్ లను డెత్ ఓవర్స్ అంటారు. ఈ ఓవర్స్ మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పుతూ ఉంటాయి. కొన్ని మ్యాచ్ లలో డెత్ ఓవర్లలో తక్కువ రన్స్ రావడం వల్ల అప్పటి వరకు ఉన్న రన్ రేట్ అమాంతం పడిపోతూ ఉంటుంది.

మరి కొన్ని మ్యాచ్ లలో డెత్ ఓవర్స్ లో బారి పరుగులు రావడం వల్ల అప్పటివరకు తక్కువ ఉన్న రన్ రెట్ ఆ మూడు ఓవర్ లలో భారీగా పెరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఐపీఎల్ లో డెత్ ఓవర్లలో భారీ స్కోరులను సాధించిన ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 నుండి ఇప్పటి వరకు డెత్ ఓవర్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ 212.22 తో బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా రస్సెల్ నిలిచాడు.

ఈయన 62 సిక్సులు 81 ఫోర్ లతో 868 పరుగులు డేత్ ఓవర్ లలో చేశాడు. ఆ తర్వాతి స్థానంలో 206.66 రన్ రేట్ తో బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ నిలువగా , మూడవ స్థానంలో 197.67 స్ట్రైట్ తో బ్యాటింగ్ చేసిన హెట్ మేయర్ నిలిచాడు. దినేష్ కార్తీక్ 195.77 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి నాలుగవ స్థానంలో నిలవగా , కేఎల్ రాహుల్ 190.53 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి ఐదవ స్థానంలో నిలిచాడు. ఇక ఐపీఎల్ లో ఈ ఐదుగురు డెత్ ఓవర్లలో భారీ స్కోరులను సాధించిన ఆటగాళ్లుగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl