(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే సెమీ ఫైనల్స్ కూడా పూర్తి అయ్యాయి. రేపు అనగా మే 26 వ తేదీన (ఐ పీ ఎల్ 2024) లో భాగంగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు కు ప్రారంభం కానుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో మంది క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్ లో అత్యంత ఖరీదైన ఇద్దరు ఆటగాళ్లు తలపడబోతున్నారు. అసలు విషయంలోకి వెళితే ... ఈ సంవత్సరం వేలం పాటలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కమిన్స్ ను ఏకంగా 20.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసుకుంది. ఇక కోల్కతా నైట్ రైడర్ జట్టు స్టార్క్ ను ఏకంగా 24.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసుకుంది. ఈ సీజన్ లో వేరే అత్యంత ఖరీదైన ఆటగాళ్లు ఇలా ఈ సీజన్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు అయినటువంటి ఈ ప్లేయర్స్ రేపు ఫైనల్ మ్యాచ్లో డీ అంటే డీ అనబోతున్నారు.

మరి ఏ జట్టు గెలుస్తుందో ఎవరు ఓడుతారో ఐ పీ ఎల్ 2024 ట్రోఫీ ని ఎవరు ఎగరేసుకు వెళ్తారు తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ సీజన్ లో పాయింట్లు పట్టికలో కోల్కతా నైట్ రైడర్స్ మొదటి స్థానంలో ఉండగా సన్రైజర్స్ హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. ఇక చివరకు పాయింట్ల పట్టికలో మొదటి రెండవ స్థానాలలో ఉన్న ఈ రెండు జట్లే ఫైనల్ కు వచ్చాయి మరి ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl