ఉత్కంఠ భరితంగా సాగుతూ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైర్మెంట్ పంచుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్లో విజేతగా నిలవబోయే జట్టు ఏది. ప్రస్తుతం అంతట ఇదే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇక ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ సీజన్ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ తో ఇక ఈ సీజన్ విజేత ఎవరు అన్న విషయం తేలిపోతుంది అని చెప్పాలి.


 అయితే ఈ ఐపిఎల్ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ దూసుకు వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్.. ఇక ఊహకందని రీతిలో.. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ప్రత్యర్ధులకు చెమటలు పట్టించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. దీంతో ఇక ఈ రెండు టీమ్స్ మధ్య జరగబోయే పోరులో విజేతగా నిలవబోయే జట్టు ఏది? ఇక ఐపీఎల్ టైటిల్ని ముద్దాడబోయే జట్టు ఏది అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలా పలువురు మాజీ ప్లేయర్లు ఇస్తున్న రివ్యూలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాయి అని చెప్పాలి.



 ఇక ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మ్యాథ్యూ హెడెన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఐపిఎల్ లో ఛాంపియన్గా కోల్కతా జట్టు నిలుస్తుంది అంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్  చెప్పారు. ఫైనల్ కు ముందు వారికి మూడు రోజుల విశ్రాంతి లభించడమే అందుకు కారణం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సమయంలో సన్రైజర్స్ బలాలు బలహీనతలపై కోల్కతా జట్టు ఫోకస్ పెట్టిందని.. ఇక మొదటి క్వాలిఫైర్ మ్యాచ్లో సన్రైజర్స్ ని ఓడించిన ఆత్మవిశ్వాసం కూడా కలిసి వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ గా ఉన్న కమిన్స్ ఫై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడికే నమ్మకం లేదా సన్రైజర్స్ గెలుస్తుంది అనిపించడం లేదా అంటూ కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl