సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్లో కొనసాగుతున్న ఎంతోమంది ఆటగాళ్లు మిగతా మాట తీరును మెరుగు పరుచుకునేందుకు ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే అత్యుత్తమమైన ఆట తీరుతో ఎన్నో అరుదైన రికార్డులను కూడా బద్దలు కొట్టాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇలా ప్రతి ఆటగాడు కూడా రికార్డులు బద్దలు కొట్టాలని బరిలోకి దిగినప్పటికీ కేవలం కొంత మంది ఆటగాళ్లకు మాత్రమే ఇలా రికార్డులు కొల్లగొట్టడం సాధ్యమవుతూ ఉంటుంది.


 అయితే కొంత మంది ప్లేయర్లు కేవలం ఒకటి రెండు మ్యాచ్లలో అత్యుత్తమ ప్రదర్శన చేయడం కాదు.. ఇక ఎప్పుడూ మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అద్భుతమైన ఆటతీరుతో ఇక ఎన్నో అరుదైన రికార్డులు సృష్టిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా వరల్డ్ క్రికెట్లో ఇక చాలానే రికార్డులు కొలగొట్టిన ఆటగాళ్లలో బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ షేకీబ్ ఆల్ హసన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఇతను కొన్నాళ్లపాటు బంగ్లాదేశ్ కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. కాగా ఈ సీనియర్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ చరిత్ర సృష్టించారు. ఇటీవల ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 


 అంతర్జాతీయ క్రికెట్లో 14 వేల పరుగులతో పాటు ఏకంగా అన్ని ఫార్మట్లలో కలిపి 700 వికెట్లు పడగొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు షకీబ్ అల్ హసన్. ఇటీవల అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 48 మంది బ్యాట్స్మెన్లు 14000 పరుగులను పూర్తి చేసుకున్నారు. 17 మంది బౌలర్లు 700 వికెట్ల మైలురాయిని అందుకున్నారు. కానీ ఈ రెండు ఘనతలను కలిపి సాధించిన ఏకైక క్రికెటర్ షాకీబ్ అల్ హసన్ మాత్రమే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే అరుదైన ఘనత సాధించిన అతనిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: