సాధారణంగా టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విద్వాంసానికి మారుపేరు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే అతి తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేయాల్సిన ఒత్తిడి ప్రతి బ్యాట్స్మెన్ పైన ఉంటుంది. అందుకే క్రీజులోకి వచ్చిన వెంటనే ఇక దూకుడుగా ఆడటం మొదలు పెడుతూ ఉంటారు. ప్రతి బంతిని బౌండరీకి తరలించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా దూకుడుగా ఆడాలి అనే మైండ్ సెట్ తో బ్యాటింగ్ చేయడానికి వచ్చే ఆటగాళ్లను కట్టడి చేయడం అనేది బౌలర్లకు ఒక పెద్ద సవాల్ గా మారిపోతూ ఉంటుంది.


 అందుకే టి20 ఫార్మాట్లో చాలా తక్కువగా బౌలర్లు సక్సెస్ అవ్వడం చూస్తూ ఉంటాం. అయితే ఇలా ఏ బౌలర్ ఎంతలా సక్సెస్ అయినప్పటికీ డెత్ ఓవర్ గా పిలుచుకునే చివరి ఓవర్లలో మాత్రం బ్యాట్స్మెన్ లకి భారీగా పరుగులు సమర్పించుకోవడం చేస్తూ ఉంటారు. అయితే అలాంటి డెత్ ఓవర్ పక్కన పెడితే.. ఇక మ్యాచ్ డ్రాగా ముగిసినప్పుడు సూపర్ ఓవర్ నిర్వహిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే సూపర్ ఓవర్ లో ఎక్కువ పరుగులు చేసిన వాళ్ళదే విజయం అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. అలాంటి సూపర్ ఓవర్ లో ఎక్కువ పరుగులు చేయడం అనేది బ్యాట్స్మెన్ ల లక్ష్యం.


 ఇలాంటి లక్ష్యంతో బరిలోకి దిగిన బ్యాట్స్మెన్లను కట్టడి చేయటం బౌలర్లకు సవాలతో కూడుకున్న పని. అయితే ఇలాంటి సమయంలో ఏకంగా పరుగులు ఇవ్వకుండా మెయిడిన్ ఓవర్ వేయాలి అంటే అది అసాధ్యం. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు సునీల్ నరైన్. మిస్టరీ బౌలింగ్ తో బ్యాట్స్మెన్ లని ముప్పు తిప్పలు పెట్టి.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడు అతను. అయితే పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే సూపర్ ఓవర్ ని మేయిడిన్ చేసిన ఏకైక బౌలర్ సునీల్ నరైన్ కావడం గమనార్హం. ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. బౌలింగ్లో 17 వికెట్లు తీయడమే కాదు బ్యాటింగ్లో 482 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl