మొన్నటి వరకు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరినీ కూడా అలరించిన ఐపీఎల్ ముగిసింది  దీంతో ప్రస్తుతం అందరి దృష్టి కూడా ఇక జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ పైనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ 9వ తేదీన టీమిండియా మొదటి మ్యాచ్ ఆడబోతుంది. అయితే మొన్నటి వరకు  ఐపీఎల్ మ్యాచ్లతో బిజీ బిజీగా గడిపిన ఆటగాళ్లు అందరూ కూడా ఇక ఇప్పుడు అమెరికా చేరుకుంటున్నారు. వెస్టిండీస్ యూఎస్ వేదికలుగా ఈ టి20 వరల్డ్ కప్ టోర్నీ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లందరూ కూడా అటు అమెరికా చేరుకున్నారూ. అమెరికాలో భారత ఆటగాళ్ళకి ఘనస్వాగతం లభించింది. కోహ్లీ, హార్దిక్ పాండ్యా లాంటి కీలక ప్లేయర్లు ఇంకా అమెరికా బయలుదేరలేదు అన్న విషయం తెలిసిందే.  ఈనెల 30వ తేదీన అమెరికా వెళ్లబోతున్నారు. అయితే ఇలా వరల్డ్ కప్ కోసం అమెరికా బయలుదేరే ముందు కేక్ కటింగ్ వేడుకను జరుపుకున్నారు టీం ఇండియా ఆటగాళ్లు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ అటు కెప్టెన్ రోహిత్ శర్మ కి కేక్ తినిపించబోతుండగా కేక్ తినేందుకు రోహిత్ నిరాకరించాడు.


 వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే తాను కేక్ తింటాను అంటూ రోహిత్ శపథం చేశాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ కేక్ కటింగ్ వేడుకలో రోహిత్, బుమ్రా, సూర్య కుమార్, అర్షదీప్, శివం దూబే సహ మరి కొంతమంది ఆటగాళ్లు ఉన్నారు అని చెప్పాలి. అయితే గత ఏడాది టీం ఇండియా దాదాపు వరల్డ్ కప్ గెలిచినంత పని చేసింది. వరుసగా మ్యాచ్ లలో విజయం సాధిస్తూ ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్ వరకు దూసుకుపోయిన టీమ్ ఇండియా.. ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓడిపోయి ఇక టైటిల్ చేజార్చుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ ఓటమితో భారత్ అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ కప్ గెలుస్తామని టీమిండియా ధీమాతో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: