మొన్నటి వరకు భారత క్రికెట్ ప్రేక్షకులందరినీ అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ లో వివిధ జట్ల తరపున ఆడుతూ ప్రత్యర్థులుగా పోటీపడిన భారత ఆటగాళ్లు అందరూ కూడా మళ్లీ ఒక జట్టుగా మారి ఇక దేశాన్ని గెలిపించడం కోసం సిద్ధమయ్యారు. జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో ఆడేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే జూన్ 9వ తేదీన టీమిండియా టి20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇప్పటికే టీమ్ ఇండియా ఆటగాళ్లు అందరూ కూడా అటు అమెరికా చేరుకున్నారు. అక్కడ వార్మప్  మ్యాచ్ ఆడేందుకు రెడీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఇక వరల్డ్ కప్ కోసం ఎంపికైన హార్దిక్ పాండ్యా జట్టుతో అమెరికా వెళ్లకపోవడంతో అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్లో హార్దిక్ ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్ బౌలింగ్ లో ఎక్కడ సత్తా చాట లేకపోయాడు. ఇక కెప్టెన్సీ లో కూడా విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో ఇలా ఫామ్ లో లేని ఆటగాడిని వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేయడంపై విమర్శలు కూడా వచ్చాయి.


 హార్దిక్ పాండ్యా పూర్తిగా ఫిట్నెస్ తో లేడు అంటూ వార్తలు కూడా తిరమీదికి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య హార్దిక్ పాండ్యా అటు సహచరులతో కలిసి అమెరికా వెళ్ళకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. హార్దిక్ ను పక్కన పెట్టారా అసలు ఏం జరిగింది లేదంటే హార్దిక్ గాయంతో దూరమయ్యాడ అంటూ అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇటీవల హార్దిక్ పాండ్యా న్యూయార్క్ చేరుకున్నాడు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత జట్టుతో కలిశాడు  ఇక లండన్ లో ఉన్న కారణంగా ఫస్ట్ బ్యాచ్ తో కలిసి వెళ్లలేకపోయిన పాండ్య.. ఇప్పుడు అమెరికా వెళ్ళలేకపోయాడట. దీంతో అక్కడ నుంచే నేరుగా ఆయన న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కారూ అన్నది తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలిసి హమ్మయ్య హార్దిక్ జట్టుతో చేరిపోయాడు అంటూ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: