టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా భారత క్రికెట్ చరిత్రలోనే టీమ్ ఇండియాకు రెండుసార్లు వరల్డ్ కప్ అందించిన ఏకైక కెప్టెన్ గా కొనసాగుతున్నాడు ధోని. అయితే మైదానంలో ఎంతో కూల్ గా కనిపిస్తూ ప్రత్యర్థులను భయపెట్టే మహేంద్ర సింగ్ ధోని.. తన యాటిట్యూడ్ తోనే ఎంతోమంది అభిమానుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు.


 మిస్టర్ కూల్ కెప్టెన్గా అతను సాధించిన విజయాలు మాటల్లో వర్ణించలేనివి అనడంలో సందేహం లేదు. అయితే అందరూ క్రికెటర్ల లాగా మహేంద్రసింగ్ ధోని అటు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడు. కానీ ధోనీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది అని చెప్పాలి. అయితే ధోనిని ఒక్కసారైనా కలవడానికి  అటు అభిమానులు అందరూ కూడా ఏకంగా మైదానంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు సెక్యూరిటీని దాటుకొని మరి స్టేడియంలోకి దూసుకు రావడం చూస్తూ ఉంటాం.


 ధోని కూడా తన అభిమానులందరికీ కూడా అదే స్థాయిలో గౌరవం ఇస్తూ ఉంటాడు. అయితే ఇటీవల ipl లో భాగంగా గుజరాత్, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్లో ఒక అభిమాని మైదానంలోకి దూసుకు వచ్చి ధోని కౌగిలించుకున్నాడు. అయితే ఆ అభిమానికి సహాయం చేస్తానని ధోని హామీ ఇచ్చాడట. నేను ధోని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాక.. నాకు శ్వాస సమస్యలు ఉన్నట్లు ధోని గుర్తించారు. సర్జరీ చేయిస్తానని మాట కూడా ఇచ్చారు. నీకేం కాదు ఏం కానివ్వను అని అభయమిచ్చారు అంటూ అభిమాని చెప్పుకొచ్చాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి లాక్కెళ్ళక ముందు ధోని అభిమానితో మాట్లాడటం టీవీల్లో కనిపించింది. ఈ విషయం తెలిసి ధోని ఫ్యాన్స్ మరింత గర్వపడుతున్నారు మీ అభిమానిని అయినందుకు చాలా గర్వంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: