భారత జట్టుకు కొత్త హెడ్ కోచ్ ను వెతుక్కునే పనిలో బీసీసీఐ గత కొన్ని రోజుల నుంచి బిజీ బిజీగా ఉంది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియాకు కోచ్గా వ్యవహరిస్తున్న భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిస్తుంది. కానీ బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్ తో అతను ఇంకొన్ని రోజులపాటు ఆ పదవిలో కొనసాగేందుకు అంగీకరించారు. కానీ రెండవసారి హెడ్ కోచ్ పదవీ బాధ్యతలు చేపట్టేందుకు మాత్రం రాహుల్ ద్రావిడ్ నిరాకరించారు.  దీంతో బిసిసిఐకి కొత్త కోచ్ ను వెతుక్కోవడం అని వార్యంగా మారిపోయింది.


 ఈ క్రమంలోని కొత్త హెడ్ కోచ్ కావాలి అంటూ ఇటీవల బిసిసిఐ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కాగా చెన్నై సూపర్ కింగ్స్ హైడ్ కోచ్గా ఉన్న స్టీఫెన్ ప్లేమింగ్ కి కోచ్ బాధితులు అప్పగిస్తారని అందరు అనుకున్నా.. అది కుదరలేదు. అయితే భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ను కోచ్గా నియమించడానికి బీసీసీఐ పెద్దలు నిర్వహించుకున్నారని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని దాదాపు అన్ని చర్చలు పూర్తయ్యాయి అంటూ వార్తలు తెరమీదకి వచ్చాయి.  దీంతో గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియన్ నెక్స్ట్ హెడ్ కోచ్ అని అందరూ నమ్ముతున్న వేళ మరో వార్త సంచలనంగా మారిపోయింది.



 టీమిండియా హెడ్ కోచ్గా పదవీ బాధ్యతలు చేపట్టే విషయంపై గౌతమ్ గంభీర్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది   ఇటీవల ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అటు గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలే ఇక ఈ వార్తలకు ఊతమిచ్చేలా ఉన్నాయి. ఐపీఎల్ లో విజయవంతమైన జట్టుగా అవతరించేందుకు కోల్కతా నైట్ రైడర్స్ మరో మూడు ట్రోఫీలు గెలవాల్సి ఉంది. ఆ లక్ష్యసాధనకు మా జర్నీ ఇప్పుడే మొదలైంది అంటూ గౌతమ్ గంభీర్ కామెంట్లు చేశాడు. ఇలా ఏది ఏమైనా కోల్కతా జట్టును వదలబోనని మరో మూడు టైటిల్స్ గెలిపిస్తాను అంటూఆ జట్టుకు మెంటర్ గా వ్యవహరించిన గౌతం గంభీర్ అన్నాడు. ఇక అతను వ్యాఖ్యలు చూస్తే అతను టీమిండియా హెడ్ కోచ్ పదవిని వదులుకున్నట్లు ఎందుకంటే టీమి డే హెడ్ కోచ్ పదవిలో ఉంటే ఐపిఎల్ ఏటీఎం కి కోచ్గా పని చేసేందుకు రూల్ ప్రకారం వీలుండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: