ప్రస్తుతం భారత జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న టీమ్ ఇండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో.. ఇక బీసీసీఐ పెద్దలకు కొత్త కోచ్ ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియా కు కొత్త కోచ్ గా రాబోయేది ఎవరు అనే విషయంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, గౌతమ్ గంభీర్ ఇలా చాలామంది పేర్లు టీమిండియా హెడ్ కోచ్ రేస్ లో ఉన్నాయి అంటూ వార్తలు తెర మీదికి వచ్చాయ్.


 అయితే గౌతం గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా  నియమించబడ్డాడని త్వరలోనే దీనిపై అటు బిసిసిఐ పెద్దలు కూడా అధికారిక ప్రకటన చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. మరోవైపు కోల్కతా జట్టు కోసం గౌతమ్ గంభీర్  టీమిండియా హెడ్ కోచ్ పదవిని వదులుకునేందుకు రెడీగా ఉన్నాడంటూ ఇంకొన్ని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో వాళ్లు వీళ్లు ఎందుకు టీమిండియాకు రెండుసార్లు వరల్డ్ కప్ అందించిన ధోనినే హెడ్ కోచ్ గా నియమిస్తే సరిపోతుంది కదా అని ఇంకొంతమంది భారత క్రికెట్ ఫ్యాన్స్ కూడా బీసీసీఐకి సూచనలు చేస్తున్నారు. అయితే ధోని అటు టీమిండియా హెడ్ కోచ్ అయ్యేందుకు అసలు అవకాశం లేదు అని చెప్పాలి. ఎందుకంటే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న ఆటగాడు అన్ని ఫార్మాట్లనుంచి క్రికెట్కు రిటైర్మెంట్ తీసుకొని ఉండాలి. అయితే 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ తీసుకున్న మహేంద్ర సింగ్ ధోని అటు ఐపీఎల్ కెరియర్ కు మాత్రం రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున ఆడుతూనే ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా ఐపీఎల్లో ఆడుతున్న కారణంగా ధోని ఇక హెడ్ కోచ్ పదవికి అర్హుడు కాదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: