టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఆట తీరుతో అన్ని దేశాల్లో కూడా తనకు అభిమానులను సంపాదించుకోవడంలో సక్సెస్ అయ్యాడు విరాట్ కోహ్లీ. అయితే ఇప్పటివరకు క్రికెట్లో ఎంతోమంది లెజెండరీ క్రికెటర్స్ సాధించిన ఎన్నో రికార్డులను అలవోకగా బద్దలు కొట్టి  ప్రపంచ క్రికెట్లో తనను మించిన లెజెండ్ మరొకరు లేరు అన్న విషయాన్ని ఇప్పటికే నిరూపించుకున్నాడు.


 అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి దశాబ్దన్నర కాలం గడిచిపోతున్నప్పటికీ ఇంకా జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడిలాగానే ఏదో నిరూపించుకోవాలి అనే కసి కోహ్లీలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే మూడు ఫార్మాట్లలో కూడా పరుగుల వరద పారిస్తూ ఉంటాడు. అయితే కోహ్లీ మైదానంలో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎంత అగ్రసీవ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఇక అతని యాటిట్యూడ్ చూస్తే ప్రత్యర్ధులు భయపడిపోతూ ఉంటారు. అతనితో గొడవలు పెట్టుకోవడానికి అస్సలు సాహసం చేయరు. గతంలో చాలామంది క్రికెటర్లు కోహ్లీ తో గొడవ జరిగినప్పుడు వెనక్కి తగ్గిన సందర్భాలు ఎన్నో చూసాం.


 అయితే మొన్నటికి మొన్న ముగిసిన ఐపీఎల్ సీజన్లో కోల్కతా బౌలర్ హర్షిత్ రానా ఏకంగా ప్రత్యర్థి ఆటగాళ్లకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అటు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి కూడా ఇలా ఫ్లయింగ్ కిస్ ఇస్తారా అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవ్వగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడు. దూకుడుకు మారుపేరైన కోహ్లీ ముందు ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్స్ చేయబోను అంటూ హర్షిత్ రానా చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఐపీఎల్లో సన్రైజర్స్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది ప్లాన్ ప్రకారం కాదు అంటూ తెలిపాడు. అయితే ఇలా ఫ్లయింగ్ ఇచ్చిన కారణంగా అతనిపై ఐసీసీ చర్యలు తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: