సాధారణంగా సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన పర్సనల్ విషయం ఏదైనా తెరమీదకి వచ్చిందంటే చాలు అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎంతోమంది సెలబ్రిటీల ప్రేమ పెళ్లి వ్యవహారాలు ఎంతల హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఏకంగా ప్రేమ పెళ్లి వ్యవహారాలతో కాకుండా విడాకుల వ్యవహారాలతోనే ఎక్కువగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు.


 కేవలం సిని సెలబ్రిటీలు మాత్రమే కాదు అటు ఎంతో మంది స్టార్ క్రికెటర్లు సైతం ఇలా తమ భాగస్వాములతో విడాకులకు సిద్ధమవుతూ.. ఏళ్లనాటి వైవాహిక బంధానికి స్వస్తి పలికేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్, మహమ్మద్ షమీ లాంటి క్రికెటర్లు తమ భార్యలతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే  ఇక ఇప్పుడు మరో టీమిండియా స్టార్ క్రికెటర్ కూడా ఇలాగే విడాకులకు సిద్ధమయ్యాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆ క్రికెటర్ ఎవరో కాదు మనీష్ పాండే.


 టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న మనీష్ పాండే తన భార్య ఆశ్రితశెట్టితో విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో ఉన్న పెళ్లి ఫోటోలను తొలగించడమే ఇందుకు కారణం. ఇలా ఫోటోలు తొలగించడంతో వీరి మధ్య విభేదాలు వచ్చాయని.. దీంతో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఉత్తరాఖండ్ కు చెందిన మనీష్ పాండే మోడల్ అయినా ఆశ్రిత శెట్టిని వివాహం చేసుకున్నాడు. కాగా అతను టీమ్ ఇండియా తరఫున 29 వన్డేలు, 37 t20 మ్యాచ్ లు ఆడాడు. ఐపీఎల్ లోనే అన్ని టీమ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. కాగా మొన్నటికి మొన్న టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా సైతం విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు రాగా.. అవి అవాస్తవాలు అన్న విషయం తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: