ప్రస్తుతం పారిస్ వేదికగా జరుగుతున్న క్రీడల పండుగ ఒలంపిక్స్ లో భారత్ మునుపటితో పోచి చూస్తే ఈసారి నిరాశ పరుస్తూ ఉంది అని చెప్పాలి అనే దేశాలు గోల్డ్ మెడలు సిర్వెల్ మెడలు సాధిస్తూ ఇక దూసుకుపోతూ ఉంటే.. అటు భారత అథ్లెట్లు మాత్రం మెడల్స్ సాధించలేకపోతున్నారు. మెడల్స్ వచ్చినట్టే వచ్చి చివర్లో దురదృష్ట వశాత్తు  ఇక మెడల్ చేజార్చుకుంటున్నారు అని చెప్పాలి. కాగా ఇప్పటివరకు భారత్ ఖాతాలో కేవలం మూడు కాంస్య పథకాలు మాత్రమే చేరాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇండియన్ క్రీడాభిమానులు అందరికీ కూడా భారత హాకీ జట్టుపై ఆశలు చిగురించాయి.



 ఇండియాలో హాకీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఏకంగా భారత హాకీ జట్టు తీవ్రంగానే శ్రమిస్తూ.. ఒలంపిక్స్ లో ప్రత్యర్ధులను ఓడిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతూ ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు కోట్లాదిమంది అభిమానుల ఆశలను తీర్చేందుకు ఇండియన్ హాకీ టీం కి సువర్ణ అవకాశం లభించింది. విశ్వ క్రీడల్లో ఇటీవలే జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో హాకీ జట్టు అదరగొట్టేసింది. బ్రిటన్ తో జరిగిన ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో కేవలం పదిమందితోనే 48 నిమిషాల పాటు పోరాడిన భారత జట్టు.. షూట్ అవుట్ లో బ్రిటన్ ఓడించి అదరగొట్టేసింది  


 ఈ క్రమంలోనే ఫైనల్ కు చేరాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే ఒలంపిక్స్ లో 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాని ఓడించడం.. క్వార్టర్ ఫైనల్ లో బ్రిటన్ పదిమందితోనే ఆడి మట్టి కరిపించడంతో ఇక భారత జట్టు దూకుడు చూస్తూ ఉంటే ఈసారి తప్పకుండా ఒలంపిక్స్ లో బంగారు పతకం గెలవడం ఖాయం అని ఎంతో మంది క్రీడాభిమానులు కూడా నమ్మకం పెట్టుకున్నారు. కాగా నేడు భారత జట్టు అటు జర్మనీ తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. ప్రపంచ ఛాంపియన్ అయిన జర్మనీ ఓపక్క ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్ ఒకపక్క నేడు సమరానికి సిద్ధమయ్యాయి. వరల్డ్ నెంబర్ 2 అయిన బ్రిటన్ ను ఓడించిన భారత జట్టు ఇక నేడు జర్మనీని ఓడించి ఫైనల్ కు చేరుతుందని భారత అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఏం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: