ఈ మధ్య కాలంలో భారత పురుషుల జట్టు ఆట తీరుతో పోలిస్తే ఏ మాత్రం తీసిపోని రీతిలో భారత మహిళా క్రికెట్ జట్టు ఆట తీరును ప్రదర్శిస్తూ వస్తుంది. ఈ మధ్య కాలంలో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతమైన ఆట తీరును కనబరిస్తూ ఎన్నో టోర్నీలలో గెలుపొందింది. ప్రస్తుతం ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ 20205 లో భారత మహిళా క్రికెట్ జట్టు ఆట తీరు అంతా ఆశాజనకంగా లేదు. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత మహిళా జట్టు నాలుగు మ్యాచ్ లను ఆడింది.

అందులో కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే గెలుపొందింది. ప్రస్తుతం మన జట్టు పాయింట్లు పట్టికలో టాప్ 4 లో ఉన్నప్పటికి కేవలం 4 పాయింట్లతో మాత్రమే ఆ స్థానంలో ఉంది. కాబట్టి ఆ స్థానం అంత సురక్షితం కాదు. ఇలా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడి అందులో రెండు ఓడిపోవడంతో భారత జట్టుకు సెమీస్ ఆశలు అంత ఆశాజనకంగా లేవు. భారత జట్టు సెమిస్ కి చేరాలి అంటే ఒకే ఒక మార్గం కనబడుతుంది. భారత జట్టు మరో మూడు మ్యాచ్ లను ఆడబోతుంది. అందులో కనీసం రెండు మ్యాచ్ లలో గెలుపొందినట్లయితే టీమిండియా జట్టు సెమిస్ కి చేరే అవకాశాలు ఉంటాయి.

ఇక భారత జట్టు ఆడాల్సిన మ్యాచ్ లలో ఒక మ్యాచ్ ఆస్ట్రేలియా తో , మరో మ్యాచ్ ఇంగ్లాండ్ తో , మరో మ్యాచ్ బంగ్లాదేశ్ తో తలబడనుంది. ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ ప్రస్తుతం అద్భుతమైన ఆట తీరును కనబరుస్తున్నాయి. దానితో ఆ రెండు జట్లను ఓడించడం మామూలు విషయం కాదు. అలాగే బంగ్లాదేశ్ జట్టు ను కూడా అంత ఈజీగా తీసేయలేము. దానితో భారత జట్టు మిగిలి ఉన్న మూడు మ్యాచ్ లలో అద్భుతమైన ఆట తీరును కనబరిచి రెండు మ్యాచ్ లలో గెలుపొందినట్లయితే సెమీస్ కి చేరే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: