వాషింగ్‌టన్: స్పేస్ ఎక్స్ ప్రయోగం విఫలమైంది. పంపిన రాకెట్ పేలిపోవడంతో స్పేస్ ఎక్స్ మరో పరాజయాన్ని చవి చూసింది. చంద్రుడు, అంగారకుడు వంటి గ్రహాలపై పరిశోధలు చేసేందకు స్పేస్ ఎక్స్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈప్రైవేటు సంస్థ స్టార్ షిప్ నమూనా రాకెట్ పరిచయం చేసింది. దాన్ని ఇటీవల ప్రయేగించింది. ఈ ప్రయోగం అమెరికా టెక్సాన్ తీరంలో జరిగింది. ఈ ప్రయేగంలో స్టార్ షిప్ నమూనా భూమిపై ల్యాండ్ అయ్యే సమయంలో కూప్పకూలింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఈ సంస్థ షేర్ చేసింది. ఇదిలా ఉంటే అసలు ఈ ప్రయేగం ఏంటని చాలా మందికి తెలియదు.
 అంగారకుడు, చంద్రుడి పైకి మావులు ప్రయాణం చేయగలగాలని అందులో భాగంగా మానవులను, కొంత సామాగ్రిని పంపి తిరిగి తీసుకొచ్చేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే స్టార్ షిప్ పేరుపై రాకెట్‌లను తయారు చేస్తోంది. ఈ ప్రయేగాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి అందుకనే ముందుగా నమూనా రాకెట్‌లను ప్రయోగిస్తారు. అలా చేసిన ప్రయేగమే ఇది. అయితే ఈ ప్రయోగం విఫలమయినందుకు ఏమాత్రం బాధ లేదని, కావలసిన విషయాలను తెలుసుకున్నామని సంస్థ అధినేత అలాన్ మస్క్ తెలిపారు. ఇంతకీ ఏమైందంటే ఈ ప్రయోగంలో భాగంగా స్టార్‌షిప్ నమూనాను పరశోధించారు. రాకెట్ తొలుత అందరు ఆశించిన విధంగా ఆకాశంలోకి దూసుకెళ్లింది.
అనుకున్న ప్రోగ్రామ్ ప్రకారం రాకెట్‌లోని మూడు ఇంజన్‌లు సిరిగానే పనిచేశాయి. అయితే తిరిగి భూమిని చేరుకునే దశలో ఈ మూడు ఇంజన్‌లలో రెండు ఇంజన్‌లు పనిచేయడం ఆగిపోయాయి. దాంతో నిర్ణీత ఎత్తుకు వెళ్లిన రాకెట్ తిరిగి భూమిని చేరుకోవడం మొదలుపెట్టింది. రెండు ఇంజన్‌లు ఆగిపోయిన 4 నిమిషాల 45సెకండ్లకు మూడో ఇంజన్‌ కూడా పనిచేయడం మానేసింది. దీంతో భూ ఆకర్షణ కారణంగా రాకెట్ తన వేగాన్ని మరింతగా పుంజుకుంది. ప్రెజర్‌పెరగడంతో ముందు ఆగిపోయిన రెండు ఇంజన్‌లు తిరిగి మొదలయ్యాయి.
 అప్పటికే ఆలస్యం అయిపోవడంతో రాకెట్ భూమిని ఢీ కొట్టింది. అయితే రాకెట్ విఫలమైనందుకు ఎటువంటి బాధ లేదని కావలసిని సమాచారం మాకు లభించిందని అలాన్ మస్క్ తెలిపారు. ఈ ప్రయోగంలో ప్రయోగించిన రాకెట్ కవచ దృఢత్వం, ఇంజన్‌తల పనితీరు, రాకెట్ భూమిని చేరుకునే సమయంలో ఎదుర్కునేటప్పుడు ఎటువంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు అనేవాటిపై ఓ అంచనాకోసం వీరు ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: