ద్విచక్ర వాహనాల ప్రముఖ బ్రాండెడ్ గా పేరు పొందింది హీరో హుండా కంపెనీ. అయితే ఈ సినిమా కంపెనీ రెండు విడిపోయి తర్వాత కొన్ని వేరియంట్లలో హుండా టాప్ లోనే ఉంటే మరి కొన్ని వాటిలో హీరోకి తిరుగు లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా 125 cc పైన సామర్థ్యం ఉన్న బైకులలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.హుండా షైన్ యూనికాన్ వంటి మోడల్స్ లో మార్కెట్లోకి బాగా దూసుకుపోతోంది. ఇదే క్రమంలోనే 100 cc వేరియంట్లలో హీరో కంపెనీ ఆధిపత్యం బాగా ఉన్నది.


హీరో స్పెండర్ కు ఉన్న క్రేజ్ వల్ల ఈ 100 cc వేరియంట్లలో హుండా నుంచి ఎటువంటి వాహనాలు రాలేదు. ఇప్పుడు తాజాగా హీరో స్పెండర్ కు పోటీగా..హుండా కంపెనీ షైన్ 100 cc నీ మార్కెట్లోకి విడుదల చేసింది ఈ కొత్త బైక్ స్పెండర్ కన్నా అతి తక్కువగానే ధరకు ఇవ్వబోతున్నట్లు సమాచారం. పన్నులు మినహాయించగా కేవలం ఈ బైక్ రూ.64,900 రూపాయలకే ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం.

గ్రామీణ వినియోగదారులను లక్ష్యంగా ఉంచుకొని హుండా ఈ కొత్త బైక్ ని లాంచ్ చేసింది.హుండా షైన్ 100 బైక్ పనితీరు దాదాపుగా హీరో స్పెండర్ ప్లస్ బైక్ మాదిరే ఉంటుందట. ఈ బైక్ 97.2cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ బైక్ కి నాలుగు స్పీడ్ గేర్లు కలవు వినియోగదారుల భద్రత దృష్టిలో ఉంచుకొని సైడ్ స్టాండ్ ఉన్నప్పుడు ఇంజన్ స్టార్ట్ కాకుండా ఉండే ఆప్షన్ను తీసుకువచ్చింది. ఈ బైక్స్ వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఆల్ న్యూ బైక్స్ బ్లాక్ విత్ రెడ్ బ్లూ గ్రీన్ తదితర కలర్లలో కలవు. ఈ బైక్ 65 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం అలాగే ఆరేళ్ల వారంటీతో కూడా కలవు. మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నవి..

మరింత సమాచారం తెలుసుకోండి: