ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యులను అలాగే టెక్ ప్రియులను దృష్టిలో పెట్టుకొని చాలా టెక్ కంపెనీ లు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీల మధ్య పెరిగిన పోటీ కారణంగా మార్కెట్లోకి కూడా అదునాతన టెక్నాలజీతో కూడిన ఫోన్లు రోజుకొకటి వస్తున్నాయి.  ఇప్పుడు వినియోగదారులను ఆకర్షించడానికి మరికొన్ని కొత్త ఫీచర్లను కంపెనీ తయారుదారులు జోడిస్తున్నారు. ఇకపోతే స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వారికి ప్రధాన సమస్యల్లో చార్జింగ్ కూడా ఒకటి అన్న విషయం అందరికీ తెలిసిందే. దీనిని చెక్ పెట్టడానికే తాజాగా షావోమి ఒక కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది.

కేవలం ఒక్క శాతం చార్జింగ్ ఉన్నా సరే గంటసేపు వరకు ఏకధాటిగా మీరు ఫోన్ మాట్లాడవచ్చు.. షావోమి 13 అల్ట్రా పేరుతో ఒక ఫోన్ లాంచ్ కాబోతోంది . యితే ముందుగా చైనా మార్కెట్లోకి వచ్చే ఈ ఫోను ఆ తర్వాత ఇండియాలో విడుదల కాబోతోంది.  ఇకపోతే ఇప్పటివరకు కంపెనీ ఫీచర్లకు సంబంధించి ఎటువంటి అధికారికంగా ప్రకటన చేయలేదు కానీ నెట్టింట లీకైనా కొన్ని వివరాల ఆధారంగా ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం.

ఇకపోతే ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే నైట్ సీన్స్, 8కే వీడియో తీసుకోవడానికి కూడా ఈ ఫోన్ చాలా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్లో బ్యాటరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కంపెనీ సీఈవో స్పష్టం చేశారు. ఇక ఈ ఫోన్లో 6.7 ఇంచెస్ 2కె ఆమో ఎల్ఈడి స్క్రీన్ ను ఇవ్వనున్నట్లు సమాచారం అలాగే సెల్ఫీ కోసం ఫ్రంట్ న 32 ఎంపీ కెమెరాను కూదా అలాగే 16 జిబి ర్యామ్, 512 జిబి స్టోరేజ్ ఈ ఫోన్ యొక్క ప్రత్యేకత అయితే ధర ఎంత ఉంటుంది అనేది మాత్రం ఇంకా తెలియలేదు. వచ్చేనెల ప్రారంభంలో ఈ ఫోన్ లాంచ్ కాలున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: