ప్రేమి విశ్వనాథ్.. ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ వంటలక్క లేదా దీప అంటే ట‌క్కుమ‌ని గుర్త‌ప‌డ‌తారు బుల్లితెర ప్రేక్ష‌కులు. కార్తీక దీపం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన వంట‌ల‌క్క‌కు ప్ర‌స్తుతం ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీపగా, వంటలక్కగా నటి ప్రేమి విశ్వనాథ్ తన నటనతో ఆకట్టుకుంటోంది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్‌ వచ్చినా కార్తీక దీపం సీరీయల్‌ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. అంతలా మెప్పించిన కార్తీక దీపం సీరీయల్‌కు వంటలక్క నటనే ప్రధాన ఆకర్షణ.

 

కార్తీక దీపం అంటే వంటలక్క అనేంతగా ప్రేక్షకుల నోళ్లలో ఈ సీరియల్ నానింది.  మేని ఛాయ నలుపైనా తన చిరునవ్వుతోనూ తన అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసే అందం ఆమె సొంతం. మలయాళం టీవీ తెర పరిశ్రమకు చెందిన ప్రేమి విశ్వనాథ్ అదే భాషలో కరుతముత్తు సీరియల్ ద్వారా పరిచయం అయ్యింది. ఇక ఇప్ప‌టికే  ఈ సీరియల్ 750 ఎపిసోడ్‌లకు పైగా పూర్తిచేసుకుంది. అలాగే  కార్తీక దీపం సీరియల్ కు కనెక్ట్ అయిన ప్రతిఒక్కరు వంటలక్క ఫ్యాన్సే అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఇటీవ‌ల ప్ర‌సార‌మ‌వుతున్న కొన్ని ఎపిసోడ్ల‌లో వంట‌ల‌క్క క‌నిపించ‌డం లేదు. 

 

ఈ క్ర‌మంలోనే వంటలక్క ఈ సీరియల్‌ను వీడుతున్నారని, ఆమె స్థానంలో మరో నటిని తీసుకోబోతున్నారనే వార్త నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. దీంతో వంట‌ల‌క్క ఫ్యాన్స్ తెగ కంగారు ప‌డ్డారు. రోజులు గడుస్తున్నా కొద్దీ ఈమె కనిపించకపోయే సరికి ఈమె పాత్రను తీసేస్తున్నారని వదంతులు మ‌రింత ఎక్కువ అయ్యాయి. అయితే తాజాగా ప్ర‌సార‌మైన ఎపిసోడ్‌లో వంట‌ల‌క్క ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డంతో.. ఆమె ఫ్యాన్స్ ఒక్క‌సారిగా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి ఎలాగోలాగా వంటలక్క పాత్రను తీసుకొచ్చి చూపించేసరికి ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కాగా, ప్ర‌స్తుతం కార్తీక‌దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. రోజురోజుకు మ‌రింత ఉత్కంఠ‌కు తెర లేపుతుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: