బుల్లితెరపై.... వెండితెర తరహాలో ఆహా..!!! అనిపించే సెలబ్రెటీలతో సందడి చేస్తున్న బిగ్ బాస్ షో క్రేజ్ అందరికి తెలిసిందే... సీజన్ వన్ టూ త్రీ ల ను విజయవంతం గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.... ఇప్పుడు సరికొత్తగా సీజన్ ఫోర్ తో మన ముందుకు వచ్చింది. ఎంతో అద్భుతంగా సీజన్ ఫోర్ ని లాంచ్ చేశారు మన మన్మధుడు నాగ్... అయితే ఈసారి ప్రేక్షకులు ఆశించిన రేంజ్ లో సెలబ్రిటీలు పెద్దగా లేకపోవడంతో మొదట కాస్త డిసప్పాయింట్ అయినా.... పోను పోను మంచి ఊపందుకుంది బిగ్ బాస్ సీజన్ 4. 




కంటెస్టెంట్ లు అందరూ ఎవరికి వారు ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు.. హౌస్ లో అప్పుడే టాస్క్ ల గోల మొదలైంది... ఎవరికివారు పోటాపోటీగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో  పాల్గొంటూ వారి సత్తా చాటుకుంటున్నారు. నిన్న రాత్రి టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ రసవత్తరంగా గడిచింది... దేత్తడి హారిక కు హౌస్ లోని కంటెస్టెంట్ లను ఎంటర్ టైన్ చేయమని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వగా..... మొదట లుక్ బాగుండాలి అంటూ పొట్టి బట్టలతో రెచ్చిపోయింది హారిక.... అ...ఆ...అ...ఆ.. నా మాటే వింటారా..!! అంటూ ముమైత్  పాటతో దుమ్ములేపేసింది. 




ఈ టాస్క్ లో భాగంగానే.... నోయల్ తో కలిసి హారిక తన బామ్మ గంగవ్వ దగ్గరికి వచ్చి మేము ప్రేమించుకున్నాం.... పెళ్లి చేసుకుంటామంటూ అడగగా.... పల్లెటూరి యాస తో వద్దే వద్దు అంటూ కామెడీ పండించింది గంగవ్వ... మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ అంటూ లాస్య, మోనాల్ లు స్పెషల్ విగ్ లతో సందడి చేశారు...ఇక షో విషయానికొస్తే సీజన్ ఫోర్ సెలబ్రిటీల దృష్ట్యా మొదట్లో రేటింగ్స్ గురించి కొద్దిగా భయపడిన... ప్రస్తుతం బాగానే ఊపందుకుంది. మరి రానున్న ఎపిసోడ్ లలో ఏమేమి జరగనున్నాయి అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: