బిగ్ బాస్ షో ఇప్పుడు ఇలా మారిందెంటి అంటూ ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు.  అది నిజమే అనుకోండి.. మొదట పస లేదు అన్న ప్రేక్షకులు ఇప్పుడు కసి ఎక్కువైంది అంటూ కామెంట్లు చేస్తున్నారు..  ఏడు వారాలు పూర్తి చేసుకున్నా ఈ షో ను తొందరగా పూర్తి చేసేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ఇంటి సభ్యుల తీరు మాత్రం చిరాకు తెప్పిస్తుంది. గొడవలతో రోజును మొదలు పెట్టి రాత్రి మిడ్ నైట్ మసాలాను చూపిస్తున్నారు.



హౌస్ లో రోజు రోజుకు ప్రేమ జంటలు పెరిగిపోతున్నారు. మొన్న వరకు రెండు జంటలు ఉన్న ఈ షో కాస్త ఇప్పుడు మూడు ను బట్టి ముందుకు వెళదాము అని తయారైంది. నిన్న వచ్చిన హోస్ట్ సమంత కూడా అదే అన్నారు. ప్రేమికుల వ్యవహారాన్ని ఇన్ డైరెక్ట్ గా కడిగి పడేశారు..సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అలా కూడా షో రేటింగ్ భారీగా పెరగడంతో షో పేరు మారు మోగిపోయింది.. అయితే ఈ షో పై అమ్మ రాజశేఖర్ మాస్టర్ భార్య రాధా మండిపడుతున్నారు.



నిన్నటి ఎపిసోడ్ లో లాస్య పై విరుచుకుపడిన ఈమె ఇప్పుడు మరోసారి కన్నెర్ర చేశారు..అమ్మా రాజశేఖర్‌తో దివి బాండింగ్ పెట్టుకోవడం.. ఈ ఇద్దరూ కలిసికట్టుగా గేమ్ ఆడటం.. ఒకర్నొకరు సపోర్ట్ చేసుకోవడం.. చాలా మంది ప్రేక్షకులకు నచ్చలేదు. ఆ గుండు కొట్టించుకునే ఎపిసోడ్‌లో అయితే అమ్మా రాజశేఖర్ కమల్ హాసన్‌ని మించి పెర్ఫారమెన్స్ చేశాడు.. దీనికి స్పందించిన దివి బోరున ఎడ్చింది. ఈ విషయం పై సోషల్ మీడియా లో ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా ఈ విషయాన్ని ఖండించారు.. రాధా.. తన భర్త మీద నమ్మకం ఉంది. ఆయనకు లవ్ ట్రాక్‌లు ఉన్నాయి అంటే అది కామెడీనే. నాకైతే అలాంటివి ఉన్నాయని అనిపించలేదు. మేల్, ఫిమేల్ కాస్త క్లోజ్‌గా ఉంటే ప్రేమ పుడుతుందా అని మండిపడ్డారు.  ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తే అమ్మా విన్నర్ అవుతారాలేక ఎవరు అవుతారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: