బిగ్ బాస్ షో లో పాల్గొన్న ఇంటి సభ్యులు వారం చివరిలో ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తారు.. అలా ఎలిమినేట్ అయిన వాళ్లంతా కూడా బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఏదోక టీవీ ఛానెల్స్ లేదా యుట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవల బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కుమార్ సాయి కి మాత్రం బయట ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇతగాడు మాత్రం చాలా ఇంటర్వ్యూ లకు హాజరయ్యాడు. 




అయితే కుమార్ సాయి ఎలిమినేషన్ ను జీర్ణించుకోలేక పోతున్నారు.. సూర్యకిరణ్, కరాటే కళ్యాణి, దేవి, స్వాతి దీక్షిత్, కుమార్ సాయి, జోర్దార్ సుజాత, దివి ఇలా ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నాయి. అయితే కుమార్ సాయి ఎలిమినేషన్ అప్పుడు ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆట తప్ప వేరే ధ్యాస లేకుండా ఫెయిర్ గేమ్ ఆడుతున్న కుమార్ సాయిని ఎలిమినేట్ చేసి మోనాల్ గజ్జర్‌ని సేవ్ చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.



ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కుమార్ సాయితోనూ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ శివ.. యూట్యూబ్‌లో ఆ వీడియోకి ‘అయోమయం.. మబ్బుమొహం’ అని తంబ్ నెయిల్ పెట్టడంతో కుమార్ సాయి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. కుమార్ సాయిని అవమాన పరుస్తూ హేళన చేసిన యాంకర్ శివకు వార్నింగ్ ఇస్తూ కుమార్ సాయి అభిమాని ఒకరు యూట్యూబ్‌లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు కాస్త వైరల్ అయ్యింది.



సాయి ని బిగ్ బాస్ లో చూసి షాక్ అయ్యాను.. కానీ చాలా బాగా ఆడాడు. కానీ ఇలా అవుట్ అవ్వడం భాధగా ఉంది అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు.  అంటూ యాంకర్ శివ అన్నాడు. దీనికి కుమార్ సాయి విషయంలో అయ్యో పాపం అన్నారు.. కానీ యాంకర్ శివ.. కుమార్ సాయిని ఇంటర్వ్యూ చేసి.. ‘నువ్వొక అయోమయం.. మబ్బుమొహం అంటున్నారు’ అని తంబ్ నెయిల్ పెట్టాడు. అరే.. శివ  నీ యమ్మా..
ఆయన అయోమయం మబ్బుమొహం అయితే ఇంతమంది అభిమానాన్ని ఎలా సంపాదిస్తాడ్రా.. నీతిగా నిజాయితీ ఆట ఆడి కోట్ల మంది అభిమానాన్ని సంపాదించాడు.. నువ్వు నీ బ్రతుకు 2015 అర్థమయింది. నువ్వు ఒక బ్రోకర్ గాడివి అంటూ నోటికి వచ్చిన కామెంట్లు చేశాడు. ప్రస్తుతం అతని గురించి మాట్లాడుతున్నవా అంటూ సంచ లన వ్యాఖ్యలు చేశాడు.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: