బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే.. అయితే దాదాపు 11 మంది ఇంటి నుంచి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు షో లో పెద్దగా అట్రాక్షన్ లేదు. దాంతో బిగ్ బాస్ కొత్త ప్రయోగాలను చేస్తూ వస్తుంది. మొన్నటి వరకు వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ రచ్చ చేసింది. ముగ్గురిని హౌస్ లోకి తీసుకొచ్చిన కూడా ఇద్దరు ఔట్ అవ్వడంతో అవినాష్ మాత్రం ఇంకా ఏదో అలా కొనసాగుతున్నాడు.. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు ఆరు మంది ఇంటి సభ్యులు ఉన్నారు. వారిలో వాళ్ళే కొట్టుకుంటున్నారు..



అందరూ జంటలుగా మిగలగా సొహైల్ మాత్రం ఒంటరిగా మిగిలాడు.. అయితే కొత్త ప్రయోగం తో భయ పెట్టడానికి బిగ్ బాస్ రెడీ అయ్యాడు.  అదేంటంటే ఇంట్లోకి దెయ్యం క్యారక్టర్ ను ఎంట్రీ ఇచ్చాడు.బిగ్ బాస్ లో దెయ్యం.. భయంతో వణికిపోతున్నారు హౌస్ మెట్స్..నిన్నటి ఎపిసోడ్‌లో ఓన్లీ దెయ్యం మాత్రమే కనిపించడంతో సింగర్ నోయల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ ప్రచారం మొదలైంది. ఆ దెయ్యం నోయల్ దెయ్యమే అనుకున్నారంతా.. కానీ దెయ్యం ఫేస్ కట్స్ అన్నీ ఆడదెయ్యం మాదిరే ఉండటంతో నోయల్‌లే లేదే.. ఇంతకీ ఈ దెయ్యం ఎవరు? అన్న దానిపై జనాలు చర్చలు జరుపుతున్నారు.



బిగ్ బాస్ హౌస్ కనిపించి ఆ దెయ్యం హరితేజ మాదిరిగా ఉందంటూ ప్రచారం మొదలైంది. ఇక వాయిస్ కూడా సేమ్ టు సేమ్ హరితేజ మాదిరే ఉండటంతో హరితేజే ఆ దెయ్యం ఫిక్స్ అయిపోయారు చాలామంది.అయితే ఆ దెయ్యాన్ని నేను కాదు బాబోయ్ అంటూ ఫన్నీగా వీడియో వదిలింది హరితేజ. ‘ఏమిటీ.. ఆ దెయ్యం మీరే.. ఆ గొంతు మీదే.. అంటున్నారు. నేను ఎలా కనిపిస్తున్నాను. పోనీలో పిల్లలు సరదా పడుతున్నారని ఫన్నీగా తీసుకుంటే.. ఆ దెయ్యానికి ఆ దెయ్యం గొంతుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే’ అంటూ ఆవేశపడుతూ తనదైన రీతిలో పాప క్లారిటీ ఇచ్చింది. ఆ దెయ్యం ఎవరో చూడాలంటే కొద్ది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: