
20 ఏళ్ల క్రితం తనకు జుట్టు ఒత్తుగా ఉండేదని కానీ ఏండ్లు గడుస్తున్నకొద్దీ జుట్టు మొత్తం ఊడిపోయిందని.. గడ్డం కూడా బాగా పెంచడంతో తన రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని.. అందుకే తాను ఎన్టీఆర్ సినిమాల్లో నటించినా.. ఎవరు కూడా గుర్తుపట్టలేక పోతున్నారని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈయన చిరంజీవి పవన్, కళ్యాణ్, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించారు. ఈ చిత్రాల్లో ఒత్తయిన జుట్టుతో క్లీన్ షేవ్ తో కనిపించిన నవీన్ చాలా హ్యాండ్ సమ్ గా ఉండేవారు. ఆయన అప్పటి, ఇప్పటి చిత్రాలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
మొత్తం 150 సినిమాల్లో నటించిన జబర్దస్త్ నవీన్ "ప్రేమించేది ఎందుకమ్మ(1999)" మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక అమ్మాయి తో పరిచయం కాగా ఆ అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నవీన్ కి అక్షయ్ కుమార్, పవన్ దినేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రూ. 650 రూపాయలకు ఒక కంపెనీలో ఆఫీస్ బాయ్ గా తన కెరీర్ ను ప్రారంభించిన గడ్డం నవీన్ అదే ఆఫీసులో నమ్మకంగా పని చేస్తూ మంచి పొజిషన్ కి వెళ్లారట. అయితే గడ్డం తో జుట్టంతా ఓడిపోయి 60 ఏళ్ల వృద్దుడిలాగా లాగా కనిపిస్తున్న నవీన్ అసలు వయసు 44 సంవత్సరాలు మాత్రమేనట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి