పంచుల కింగ్ హైపర్ ఆది ఒకడు. షోలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న అతడు.. టాప్ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు.. ఎంత ఫేమస్ అయ్యాడో అంతకు మించి సఫర్ అవుతున్నాడు. జబర్ధస్త్ టీమ్ లీడర్‌గా మారిన తర్వాత హైపర్ ఆది దూసుకుపోతున్నాడు. అదిరిపోయే పంచులు, ప్రాసలతో ఎదుటి వారిపై దండయాత్ర చేస్తూ సత్తా చాటుతున్నాడు. అసాధారణమైన కామెడీతో ఎన్నో సార్లు బెస్ట్ పెర్ఫార్మర్గా గెలుపొందాడు.
ఇలాంటి హైపర్ మీద జబర్దస్త్ సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు.. లేడీ గెటప్‌లు వేసే వాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందన్న అందరికీ తెలిసిందే. చాలా కాలంగా ఎంతో మంది కుర్రాళ్లు ఆడవాళ్లలా యాక్టింగ్ చేస్తూ ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో సాయి అలియాస్ సాయిలేఖ ఒకరు. జబర్ధస్త్ ద్వారా ఫుల్ ఫేమస్ అయిన అతడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూతో రచ్చ చేస్తున్నాడు.యాంకర్ 'హైపర్ ఆది గురించి చెప్పింది. అతడు సెట్స్‌లో ఎలా ఉంటాడు' అని ప్రశ్నించింది. దీనికి సాయి సమాధానం చెబుతూ 'ఆది గారు సైలెంట్ కిల్లర్. అంటే వేరేగా అర్థం చేసుకోకండి. ఆయన పైకి కనిపించడు కానీ.. లోపల మాత్రం ఎంతో టాలెంటెడ్ పర్సన్.. చూస్తూనే పంచులు వేస్తాడు.. నవ్వులు పూయిస్తాడు.ఎది ఏమైనా హైపర్ దూకుడు ఎక్కువే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి