సినిమాల తో పోలిస్తే బుల్లి తెరపై వస్తున్న ఎన్నో ప్రోగ్రాం లు సందడి చేస్తున్నాయి. స్టార్ మా లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు..కొత్త కొత్త ప్రోగ్రాం లను చేస్తున్నారు. విపరీతంగా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో రేటింగ్ కూడా భారీగా పెరిగింది.లవ్ ట్రాకులు, పులిహోర బ్యాచ్‌లు, కాంట్రవర్సీ కామెంట్ల తో షోలను బాగానే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఓంకార్ తన షోలను ముందుకు తీసుకెళ్లడంతో ప్రత్యేక శ్రద్ద పెడుతుంటాడు. ఆయన యాంకర్‌గా వచ్చిన షోలెన్నో సక్సెస్ అయ్యాయి.


బిగ్ బాస్ షో ముగిసిన వెంటనే ఎంతో గ్రాండ్‌గా ప్రారంభించిన డ్యాన్స్ ప్లస్ బాగానే క్లిక్ అయింది. మోనాల్ అందాలు, ముమైత్ ఖాన్, యానీ మాస్టర్,బాబా భాస్కర్, యశ్ మాస్టర్, రఘు మాస్టర్‌ల కామెంట్లు, గొడవలు ఇలా కాంట్రవర్సీలు క్రియేట్ చేయడంతో బాగానే సక్సెస్ అవుతుంది.డ్యాన్స్ ప్లస్ షోలో బాబా భాస్కర్ ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్‌ లో ఉంటోంది. మోనాల్ గ్లామర్‌ను, క్రేజ్‌ను బాగానే వాడుకుంటున్నారు. రఘు మాస్టర్, యశ్ మాస్టర్‌లతో మోనాల్ వేసే స్టెప్పులు బాగానే వైరల్ అవుతుంటాయి. ఇక యానీ మాస్టర్‌ను బాబా భాస్కర్ తెగ ఏడ్పిస్తున్నాడు..


అది కూడా షో కు హైలెట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా.. ముమైత్ ఖాన్ తాను చెప్పాలనుకున్నది చెప్తుంది. అయితే ఆ నిర్ణయం ఓంకార్ కు నచ్చలేదు.. ఎలిమినేషన్ సమయం.. ఒకరు తప్పు చేస్తే మైనస్.. ఇంకొకరు తప్పు చేస్తే పస్ల్ ఎలా ఇచ్చారు.. అంటే చిన్న పిల్లలు అడగలేరు అని అలా ఇచ్చారా? అని ముమైత్ ఖాన్‌ను నిలదీస్తుంటే.. అక్కడి వారంత చప్పట్లు కొట్టేశారు. మొత్తానికి ముమైత్ ఖాన్ మొహం మాడి పోయింది. అయితే పూర్తి ఎపిసోడ్‌ లో మాత్రం వ్యవహారం మారిపోయి ఉంటుందని తెలుస్తోంది.. మరి ఆ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమౌతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: