బిగ్ బాస్ లో సందడి చేసిన సెలబ్రిటీలు మొత్తం ఇప్పుడు బుల్లి తెరపై హంగామా చేస్తున్నారు. స్టార్ మా సరికొత్త ప్రోగ్రాం లతో మళ్లీ రచ్చ చేస్తున్నారు. అందులో ఎక్కువగా లవ్ ట్రాక్స్ ఉన్న సంగతి తెలిసిందే... అటువంటి ప్రోగ్రాం లు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. కొన్ని షో లు బాగా క్లిక్ అవ్వడంతో పాటుగా వైరల్ కూడా అవుతున్నాయి అందులో కామెడీ స్టార్స్ ఒకటి..ప్రస్తుతం అన్ని షోలు అదే ఫార్మూలాను వాడేస్తున్నాయి. కొత్త జంటలు పుట్టుకొచ్చేలా తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఈక్రమంలో వర్ష ఇమ్మాన్యుయేల్ జంట వచ్చింది.


ఇప్పుడు ఆ జంటకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు కామెడీ స్టార్స్ పుణ్యమా అని కొత్త జంట పుట్టింది.అయితే గత రెండు వారాల నుంచి అషూ రెడ్డి ఎక్స్‌ప్రెస్ హరిల మధ్య ఏడో నడుస్తోన్నట్టుగా వ్యవహారం తేడా కొడుతోంది. అషూ రెడ్డి కోసం హరి కూడా ప్రయత్నాలు చేస్తోన్నట్టుగానే వెరైటీ స్కిట్లు వేస్తున్నాడు. హరి ప్రయత్నాలకు అషూ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగానే వ్యవహరిస్తోంది.ఏకంగా హగ్ ఇవ్వడమే కాదు బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. దీంతో హరి అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ ఘటనతో జడ్జ్‌గా ఉన్న శేఖర్ మాస్టర్ కూడా షాకైపోయాడు. అయితే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు బాగానే కలిసి వచ్చినట్టుంది.


వచ్చే ఆదివారం ప్రసారం కానున్న షో లో వీరిద్దరూ కలిసి రచ్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రవి లాస్యలు చేసింది ఒకెత్తు అయితే చివర్లో అషూ, హరిలు చేసింది మరో ఎత్తు. స్కిట్‌లో భాగంగా చేశాడో ఏమో తెలియదు గానీ ఏకంగా ప్రపోజ్ చేసేశాడు హరి. అషూ ఐ లవ్యూ అంటూ చెప్పేశాడు. మొత్తానికి ఈ కొత్త జంటకు మాత్రం నెట్టింట్లో బాగానే మద్దతు లభిస్తోంది.అషూ రెడ్డి ఆ మధ్య పవన్ కళ్యాణ్ విషయంలో బాగా ట్రోలింగ్‌కు గురైంది. పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోను షేర్ చేయడం, వాటిపై పిచ్చి పిచ్చి కామెంట్లు రావడం, వాటికి అంతే స్థాయిలో అషూ రెడ్డి రిప్లై ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు రచ్చచేస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: