వెంటనే కార్తీక్ చేతిలో మిగిలిన ట్యాబ్లెట్స్ తీసుకుని జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు గుడ్ గర్ల్ అనిపించుకున్నావ్.. వెళ్లి దీప పక్కన కూర్చో కార్తీక్ అని అంటుంది మోనిత.. కాసేపటికి దీపకి కళ్లు తిరిగి కార్తిక్ భుజాల పై పడుతుంది.. ఇది ఇలా ఉండగా..పూజ సమయంలో జరిగిన సంఘటన గురించి నీకు ఏమైనా అర్ధమైందా? అంటూ కార్తీక్ తన సంభాషణ ప్రారంభించగా.. అవును తెలుసు. మోనిత ఇచ్చిన ట్యాబ్లెట్ వల్లే నా ప్రాణానికి హానికరంగా మారింది. ఆ విషయం నాకు పూర్తిగా అర్ధమైంది అంటూ దీప ఘాటుగా స్పందించింది...
అందుకు దీప మాట్లాడుతూ.. నా ఆరోగ్యంపై ఎవరూ జాలి పడాల్సిన అవసరం లేదు. జాలి పడి నాకు చికిత్స చేయించాలని నీవు ప్రయత్నిసే నేను ఒప్పుకోలేదు. కానీ నీవు నీ భర్తను అంటూ నన్ను చెంపపై కొట్టి టెస్టులు చేయించావు. నీవు కూడా డాక్టర్‌వే కాదా.. ఆ టాబ్లెట్ నీవే ఇవ్వొచ్చుగా అని దీప అన్నారు.కార్తీక్, దీప మధ్య సంభాషణ మరింత ఎమోషనల్‌గా మారింది. నాతో గొడవతో ఇంటి నుంచి బయటకు వెళ్లి 10 సంవత్సరాలు అయింది. మూడు ఊళ్లు తిరిగావు. కానీ ఒక్క రోజు కూడా నిన్ను అనుమానించలేదు. కానీ నన్ను అనుమానించడం నాకు నచ్చలేదు అని కార్తీక్ అంటే.. గత పదేళ్లలో నీవు నాకు దూరంగా ఉన్నా నేను ఏనాడు నిన్ను అనుమానించ లేదు అని దీప అంటుంది .. దీనికి కార్తిక్ చెక్ పెడతాడు.. ఆ మాత్రల విషయాన్ని కార్తిక్ కనిపెడతాడా లేదా అన్నది ఆసక్తిగా మారుతుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి