లాస్య, యాంకర్ రవి ల బంధం ఏవిధంగా ఉండేదో, ఎలా తయారైందో, ఇప్పుడెలా తయారవుతుందో అందరం చూస్తూనే ఉన్నాం.. ఓ ప్రముఖ ఛానల్లోని ఓ షో లో గతంలో ఉన్న విభేదాలు అన్ని మర్చిపోయి కలిసి ఆ షో చేసుకుంటున్నారు ఈ ఇద్దరు ఫేమస్ యాంకర్ లు.. అయితే వీరి మధ్య ఈ బంధం మరో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అంటున్నారు ప్రేక్షకులు. మొన్నటిదాకా ఆంటీ అంటనట్లుగా ఉండీ ఇప్పుడు రొమాన్స్ డోస్ పెంచడంతో ప్రేక్షకులు నోరెళ్ళబెట్టి మరీ వీరి కెమిస్ట్రీ ని చూస్తున్నారు..

యాంకర్ గా రవి ప్రస్తుతం టాప్ పోసిషన్ లో ఉన్నాడు.. మొదట్లో వీరిద్దరూ కలిసి కొన్ని షోలు చేయగా వీరిద్దరి మధ్య అభిప్రాయబేధాలు వచ్చి ఒకరినొకరు విమర్శించుకున్నారు.. ఒకానొక దశలో వీరు పెళ్లి చేసుకుంటారు అన్న రేంజ్ లో వార్తలు రాగా చివరికి ఇద్దరు విమర్శించుకోవడంతో అభిమానులు కొంత నిరాశపడ్డారు.. ఆ తర్వాత లాస్య పెళ్లి చేసుకోవడం, ఓ కూతురు ని కనడం , బిగ్ బాస్ కి రావడం అంతా చక చక జరిగిపోయాయి.. అయితే బిగ్ బాస్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన లాస్య రవి తో కలిసిపోయి గత రోజులని గుర్తు చేస్తుంది..

 కామెడీ స్టార్స్ షోలో టాలీవుడ్ హిట్ చిత్రాలను స్ఫూప్‌లుగా చేస్తూ కామెడీని పండిస్తున్నారు.ఇది వరకే ఉప్పెన, నరసింహా వంటి సినిమాలను ఖూనీ చేసేశారు. వారు తమ స్టైల్లో మార్చేసుకుని రవి లాస్యలు చేసిన ఈ స్ఫూప్‌లు బాగానే వైరల్ అయ్యాయి. వచ్చే ఆదివారం కూడా మరో స్ఫూప్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. నువ్వొస్తానంటే నేనొద్దాంటానా సినిమా స్ఫూప్‌లో త్రిషగా లాస్య, సిద్దార్థ్‌గా రవి నటించారు. ఇక ఈ రవి ఎంట్రీ సీన్‌లోనే లాస్యను గట్టిగా హత్తుకున్నారు. లాస్య తన డిఫరెంట్ మ్యానరిజంతో ఆకట్టుకున్నారు. మొత్తానికి ఈ ఇద్దరూ రెచ్చిపోతూ మునుపటిలా తమ కెమిస్ట్రీతో హల్చల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: