ముఖ్యంగా చలనచిత్ర పరిశ్రమలో ఎక్కువగా హీరో హీరోయిన్లు, హీరోయిన్లు , డైరెక్టర్లు పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటే , మరి కొంత మంది పెద్దల నిర్ణయంతో పెళ్లిళ్లు చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. ఇకపోతే వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా డైరెక్టర్లు నటీమణులు పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలా పెళ్లి చేసుకున్న కొంతమంది నటీ మణులు ఇంకా నసీరియల్స్ లో  రాణిస్తున్నారు. తమ నటనతో కూడా  ఆడియన్స్ అందరిని బాగా ఆకట్టుకున్నారు. ఇక టీవీ రంగంలో కొంతమంది నటీమణులు డైరెక్టర్ లను , నిర్మాతలను పెళ్లి చేసుకున్నారు.. అయితే వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.కలవారి కోడలు , చంద్రముఖి వంటి సీరియల్స్ లో నటించిన నవీన, తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది అయితే ఈమె భర్త పేరు యాట సత్యనారాయణ. ఈయన కలవారి కోడళ్ళు, పెళ్లినాటి ప్రమాణాలు వంటి సీరియల్స్ కు నిర్మాతగా పని చేశారు.
కల్యాణ వైభోగం, యమలీల వంటి సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ అయిన నటి భావన. తన నటనతో అందరిని బాగా మెప్పిస్తోంది. నటి భావన భర్త పేరు విజయ్ కృష్ణ. ఇతను ప్రస్తుతం మా టీవీ లో ఇంటింటా గృహలక్ష్మి అనే సీరియల్ ను  డైరెక్ట్ చేస్తున్నాడు.
ప్రేమ ఎంత మధురం నాటిక లో నటిస్తున్న అనుశ్రీ, ఈమె నాటికలో మీరా పాత్రలో నటించి, అందరినీ బాగా ఆకట్టుకుంది. ఈమె స్వాతి చినుకులు డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది.
నిన్నే పెళ్లాడతా సీరియల్ తో బాగా పేరు పొందిన నటి మధుబాల విజయకుమార్ గా బాగా నటించింది. ఈమె రైటర్ ప్రభాకర్ ని ఈ మధ్యనే పెళ్లి చేసుకుంది.

ఇక దేవత సీరియల్ లో నటిస్తున్న శ్వేతా కూడా ఆ సీరియల్ డైరెక్టర్ బీఎన్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఇక వీరందరూ కూడా సీరియల్స్లో నటిస్తూ ఉండడం మరో విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: