ఇక సుధీర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. అది తక్కువ టైంలో ఎంతో మంచి నటుడుగా, హీరోగా, అటు వెండి తెరపై,బుల్లి తెర పై నటిస్తూ ప్రేక్షకుల ఆదరణ బాగా పొందాడు. ఇక సుడిగాలి సుధీర్ ప్రస్తుతం ఒక స్టార్ ఛానల్ లో అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఛానల్ పేరు ఏమిటంటే "స్టార్ మా".త్వరలో ఇందులో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈయన ఇలా మా టీవీ లోకి వెళుతున్నట్లు ప్రచారం కాగానే, ఈటీవీలో జబర్దస్త్ షో లో మానేస్తారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఈ టీవీ లో యాంకర్ గా చేసి బాగా ఆకట్టుకున్న హీరో సుధీర్, స్టార్ మా ఛానల్స్ లోకి వెళ్లి ఎలాంటి రోల్స్ ను లీడ్ చేస్తాడు అనే విషయంపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నారు.
ఇక అంతే కాకుండా ఢీ లో కంటెస్టెంట్ గా, ఇక ఈ మధ్యన శ్రీదేవి డ్రామా కంపెనీ లో యాంకర్ గా చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక మల్లెమాల సంస్థ తనని వదిలిపెట్టిందని, అందుచేతనే అతను మా టీవీ వంటి స్టార్ ఛానల్స్ లో అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక మా టీవీ లో సిక్స్త్ సెన్స్ ప్రోగ్రామ్ ప్రసారమౌతున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక ఈ షో కి ఓంకార్ యాంకర్ గా చేస్తున్నారు. ఇక ఈ షోలో కి సుధీర్,ఇంద్రజ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ షో లో మొత్తం ఎక్కువగా సుధీర్ గురించే చెప్పడం విశేషం. ఇక అంతే కాకుండా సుధీర్ మొదటి సారి స్టార్ మాలో అడుగుపెడుతున్నట్లుగా.. కామెంట్లు వస్తుండడంతో.. ఇక మల్లెమాల కు గుడ్ బై చెప్పేసాడు అనే విషయం అందరి నోట పుకార్లు వచ్చేలా చేస్తుంది.ఇక ఈ విషయం పై సుడిగాలి సుధీర్ తేల్చాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి