వర్ష.. బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో లో వర్ష తనదైన శైలిలో డైలాగులు విసురుతూ, తన పై పంచులు వేసుకుంటూ అందరినీ అలరిస్తూ ఉంటుంది. సీరియల్ ఆర్టిస్ట్ గా కూడా తనదైన రీతిలో నటించి అందరినీ మెప్పించింది. అంతేకాకుండా ఈమె బుల్లితెర సీరియల్ నటిస్తూ ఎంతో బిజీగా ఉంటూనే, ఇంకోవైపు ఎంటర్టైన్మెంట్ షో లో కూడా నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంది. అంతేకాదు ఈమె జబర్దస్త్ కామెడీ షో లో లేడీ కమెడియన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అంతే కాదు ఈ జబర్దస్త్ షో లో మరో కమెడియన్ అయిన ఇమ్మాన్యుయేల్ తో జత కట్టి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

అంతే కాదు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంటూ ఎప్పుడు కామెంట్లకు గురి అవుతూ ఉంటారు.. ఇటీవల జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పనుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తన అందచందాలతో సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇకపోతే ఈ ఎక్స్ ట్రా జబర్దస్త్ షో  కు సంబంధించిన ప్రోమో ను విడుదల చేయగా వైరల్ గా మారింది. విడుదల చేసిన కొద్దిసేపటికే ఆ ప్రోమోను డిలీట్ చేయడం కూడా జరిగింది.. ఈ షో లో ఏం జరుగుతుందో మాత్రం ఎవరికీ తెలియకపోగా,  పైగా జబర్దస్త్ షో నుంచి వర్ష దూరం కాబోతుంది అనే వార్తలు అందరిలో సంచలనం రేపుతున్నాయి..

ప్రోమో డిలీట్ చేయకు ముందు అందులో ఏం జరిగిందంటే , తన స్కిట్ పూర్తి చేసుకున్న తర్వాత రోజా.. ఏంటి వర్ష మీరు జబర్దస్త్ మానేయాలి అని అనుకుంటున్నారా..? ఇంతకూ అసలు ఏం జరిగింది అని ప్రశ్నించింది.. అందుకు వర్ష సమాధానం గా జబర్దస్త్ లో నేను స్కిట్  వేయడం వల్ల బాగా ట్రోల్ కి గురి అవుతున్నాను మేడం..అందుకే నేను వెళ్లిపోవాలని అనుకుంటున్నాను.. అంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది.. అంతేకాదు తన తమ్ముడు ఆమె ముఖంపై ఫోన్ చూపిస్తూ.. ఏంటక్కా..?  ఇది అని అనేసరికి తను తట్టుకోలేక పోయిందని, బాగా ఏడ్చేసింది వర్ష.

మరింత సమాచారం తెలుసుకోండి: