
హైపర్ ఆది.. ఇటు బుల్లితెరను, అటు వెండితెరను బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. జబర్దస్త్ లో ఈ మధ్యకాలంలో వీరి టీమ్ లో దొరబాబు, పరదేశి వంటి వారితోనే స్కిట్లను మెయింటెన్ చేస్తున్నాడు ఆది. ఇకపోతే అప్పుడప్పుడూ కొత్త వారిని ఎవరైనా తీసుకొచ్చి.. వారి మీద పంచులు వేసే స్కిట్ ముగించేస్తుంటారు ఆది.
ఇక ఇందులో హైపర్ ఆది డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. రైజింగ్ రాజు నామమాత్రంగా అన్నట్లుగా ఉంటాడు. ఇక పేమెంట్ విషయాన్ని కూడా ఆదినే చూసుకుంటారట.అంతేకాదు ఎలాంటి స్థితిలో అయినా డైలాగ్స్ అన్నిటిని ఆదినే రాస్తాడు. అందుచేతనే హైపర్ ఆది ఎక్కువగా తనకు కలిసొచ్చే పంచులనే రాసుకుంటారు అని అప్పట్లో ఎక్కువగా అనుకునేవారు ప్రేక్షకులు.
ఇక అంతే కాకుండా ఒక్కో సారి ఆది తన పెర్ఫార్మెన్స్ తోనే స్కిట్ ను నడిపించగలడు. ఇకపోతే వయసు అయిపోవడంతోనే రైజింగ్ రాజు మానేశాడా..?లేదంటే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నారా..?అనే విషయాలు ఇప్పుడు ఎక్కువగా ప్రేక్షకుల మదిలో ఒక ప్రశ్నలుగా మిగిలాయి. ఇక అంతే కాకుండా కొన్ని సందర్భాలలో రైజింగ్ రాజు కూడా ఆది వల్లే నాకు ఇంతటి పేరు వచ్చిందని పలు సందర్భాలలో చెప్పుకొచ్చాడు. లేదా కొంచెం ఏజ్ కాబట్టే కరోనా సోకుతుందని విశ్రాంతి తీసుకున్నాడు అని కూడా ఎక్కువగా వినిపిస్తోంది.అయితే హైపర్ ఆది తిరిగి మళ్ళీ రైజింగ్ రాజు ను తన టీం లోకి తీసుకు వస్తాడా..? రాడా
..? అనే విషయంపై మనం వేచి చూడాల్సిందే.