బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పటిలాగే నిన్న ఎపిసోడ్ కూడా ఫుల్ జోష్ తో కొనసాగింది. ఇంటి సభ్యులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమ గేమ్ స్ట్రాటజీ లను చూపిస్తున్నారన్న విషయం స్పష్టంగా కనపడుతోంది. ఎవరి గేమ్ వారు ఆడేసుకుంటున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముందుగా సిరి గురించి మాట్లాడితే గత నాలుగైదు రోజులు గా షణ్ముక్ సిరిని దూరం పెడుతున్న సంగతి తెలిసిందే. జస్వంత్ తో ఆ అమ్మాయి నాకెందుకో ఫేక్ అనిపిస్తోంది అని కూడా అనడం ఆశ్చర్యకరం. షణ్ముఖ్ తనని దూరం పెట్టడం భరించలేని సిరి రాత్రి అందరూ పడుకో ఉన్న సమయంలో షణ్ముక్ ను ఉద్దేశించి నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం లేదంటూ వాపోయింది.
నువ్వు నాతో మాట్లాడకపోతే బాధనిపిస్తుంది అని అంటే అందుకు షణ్ముక్ అయితే ఏడువ్ అనడం సరదాగా అనిపించింది.  నువ్వు నాతో అసలు టైం స్పెండ్ చెయ్యట్లేదు. అందుకే నేను వేరేవాళ్ళతో బిజీ అయిపోయాను. ఇకనైనా మాట్లాడు అని బతిమిలాడింది. అపుడు జస్వంత్ మద్యలో జోక్యం చేసుకోగా, అప్పుడు షణ్ముక్ నేను ఒకటి ఫిక్స్ అయ్యాను రా బిగ్ బాస్ హౌజ్ లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని సిరి టాపిక్ ని ఎండ్ చేశాడు. అక్కడ ఏం జరిగినా జరగకపోయినా కాస్త ఏ పనైనా చేసే ముందు కాస్త ముందు వెనక ఆలోచించాలి సిరి అంటున్నారు నెటిజన్లు. ఒక్క పాయింట్ చాలు మనం బ్యాడ్ అవ్వడానికి సో ఇకనైనా జాగ్రత్త సుమీ అంటున్నారు.

 
ఇక ఆ తర్వాత  బిగ్ బాస్ టాస్క్ లు మరియు ఈ వారం ఇంట్లో జరిగిన అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకుని ఏకాభిప్రాయంతో వరెస్ట్ పర్ఫార్మర్ ఎవరో తెలపాలని చెబుతాడు. దాంతో అందరూ కలిసి ఎక్కువగా మానస్ పేరు చెప్పడంతో అతను ఈ వారం వరెస్ట్ పర్ఫార్మర్ అని ఫైనల్ చేశారు. దాంతో బిగ్బాస్ అతడిని జైల్లో ఉంచాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. మానస్ జైల్లో ఉండగా ప్రియాంక వచ్చి మాట్లాడుతూ నేను హౌస్ లో రాఖీ కట్టాల్సి వస్తే... ఆఖరికి శ్రీ రామ్ చంద్ర కైనా కడతాం ఏమోగానీ నీకు మాత్రం అస్సలు కట్టలేను అంటూ తన ప్రేమను చెప్పకనే చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మధ్యలో హమీద కూడా మానస్ కు దగ్గరవుతోందా. దీనితో మానస్ ను ఇష్టపడుతున్న ప్రియాంకకు  చిర్రెత్తుకొస్తోంది. మరి చివరకు ఎలా జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: