తనని హౌజ్ లో టార్గెట్ వాళ్లందరినీ తన మాటల్తో ఎన్కౌంటర్ చేసేసింది అంటే నమ్మండి.
రవి గురించి చెప్తూ హౌజ్ లో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్త కెమెరాలు ఉన్నాయంటూ కౌంటర్ వేసింది. ఇక ప్రియతో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్త అంటూ రివెంజ్ తీర్చుకుంది. శ్రీ రామ్ గురించి చెప్తూ నీ గురించి కూడా నువ్ కాస్త టైం ఇచ్చుకో శ్రీ రామ్ కు చెప్పింది. అంటే ఇండైరెక్ట్ గా హమీదా వెనక తిరగడం మానేయ్ అని చెప్పిందన్నమాట. ఇలా హౌజ్ తనను హర్ట్ చేసిన వారందరినీ స్టేజ్ పై నిలబడి ఓ ఆట ఆదేసుకుంది లహరి. కానీ అందరి కన్నా రవిని ఒక చూపుతోనే ఆజన్మ శత్రువులా చేసేసింది. కెమెరాలు అన్నీ మన వైపే చూస్తున్నా ఒకటి గురించి వెనుక మాట్లాడడం కరెక్ట్ కాదని తెగేసి చెప్పింది. ఇకనైనా రవి ఆ పద్దతి నుండి బయటపడతాడా చూడాలి.