తెలుగు బిగ్ బాస్ మొదట సీజన్ లలో  ఫస్ట్ 15 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇచ్చేవారు ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ మరి కొందరు మద్యలో జాయిన్ అయ్యేవారు. కానీ ఇప్పుడు కోవిడ్ దృష్ట్యా ఆ పద్ధతిని పక్కన పెట్టి బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్స్ ఎంపిక జరిగింది. ఒకేసారి పందొమ్మిది మంది సెలబ్రిటీలను క్వారంటైన్ తర్వాత హౌజ్ లోకి ప్రవేశపెట్టారు. మద్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు  చేయలేని నేపథ్యంలో ఇలా చేసినట్లు అంతా అనుకున్నారు. అయితే ఇప్పటికే ఇంటి నుండి సరయు, ఉమాదేవి, లహరి ఇలా ముగ్గురు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు. ఇకపోతే బిగ్ బాస్ హౌజ్ అంటేనే జనాలు ఎక్కువగా కోరుకునేది కాస్త ఘాటు మసాలా అంటే నవ్వుతూ ఉండే సెలబ్రిటీలను స్క్రీన్ పై తరచూ చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ ప్రేక్షకులకు కావాల్సింది తెలియాల్సింది.

సెలబ్రిటీలు వారి నిజ జీవితంలో ఎలా ఉంటారు అని తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. మనలాగే కోప్పడతారా..కోపం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? కోపంలో ఏం మాట్లాడుతారు? వీళ్ళకి లవ్ ట్రాక్ లు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అందుకే బిగ్ బాస్ హౌజ్ లో ఫన్ తో పాటు కాస్త వివాదాల మసాలా కూడా ఉంటేనే సందడిగా ఉంటుంది. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే మనిషి అంటే అన్ని ఎమోషన్స్ ని కలిగి ఉంటాడు. సందర్భాన్ని బట్టి షూటింగ్ లో అయితే నటిస్తాం కానీ నిజమైన ఎమోషన్స్ బయటకు రావు. అయితే బిగ్ బాస్ హౌజ్ ఒక రియాలిటీ షో కాబట్టి ఇక్కడ షూటింగ్ జరగదు కానీ ఆల్రెడీ హౌజ్ లో సెట్ చేసిన కెమెరాలు నిరంతరం ఇంటి సభ్యుల మూమెంట్స్ ని షూట్ చేస్తూ ఉంటాయి.  కాగా సరయు అంటేనే దేత్తడి పోచమ్మ గుడి అనే రేంజ్ లో మనకు బయట తెలుసు.

అదే రేంజ్ లో ఇంట్లో తన దూకుడు చూపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ హౌజ్ లో అంతగా అనిపించలేదు. ఆమెకు అంత అవకాశం కూడా రాలేదు.  మొదటి వారం లోనే ఆమె ఎలిమినేట్ అవడంతో చాలా మంది ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈమె మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేరిట మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. హౌజ్ లో హుషారు డబుల్ చేసేందుకు ఇలా రీ ఎంట్రీ ఉండబోతుందని అని బిగ్ బాస్ బిగ్ న్యూస్ లో అందుతున్న  సమాచారం. బయట కరోనా ఉదృతి కూడా తగ్గిన నేపథ్యంలో ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి నిజమేనా కాదా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: