తెలుగు రాష్ట్రాల్లో గత అయిదు సంవత్సరాలుగా ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే ఇది నాలుగు సీజన్ లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని, అయిదవ సీజన్ లో కూడా సగం ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. దీనితో హౌజ్ లో మొదట వచ్చిన 19 మంది నుండి 7 గురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలింది కేవలం 12 మంది మాత్రమే. అయితే ఇంక కేవలం సగం రోజులే మిగిలి ఉండగా టైటిల్ విజేత ఎవరనే విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే నిన్న జరిగిన ఎపిసోడ్ లో నామినేషన్లు జరిగాయి. ఈ సారి బిగ్ బాస్ నామినేషన్స్ ను ఎమోషన్స్ తో ముడిపెట్టారు. అయినా కూడా హౌజ్ లో ఉన్న సభ్యులు ఎవరూ కూడా ట్రిప్ కాకుండా, ఎంతో పరిపూర్ణత కూడిన మనస్సుతో అందరూ ఒకరికొకరు సహాయపడుతూ నామినేషన్ ను ముగించారు.

ఇందులో భాగంగా ఈ వారం లెటర్ పొందని కారణంగా సిరి, షన్ముఖ్, శ్రీరామచంద్ర, లోబో, మానస్ మరియు రవిలు నామినేట్ అయ్యారు. ఇంట్లో సభ్యులు అందరూ ఎమోషన్ లో మునిగిపోయారు. ప్రతి ఒక్క సభ్యుడు కన్నీటి పర్యంతమయ్యారు. దాదాపు 50 రోజులుగా ఇంటితో ఎటువంటి సంబంధం లేకపోవడంతో, లెటర్ తో ఒక చిన్న సంతోషం వారి మనసుకు మరింత బూస్ట్ అప్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక విషాదకరమైన విషయం ప్రేక్షకులకు తెలిసింది. లెటర్ టాస్క్ లో బాగంగా బిగ్ బాస్ షన్ముఖ్ మరియు కాజల్ లేఖలను పోస్ట్ బ్యాగ్ లో పంపారు. అయితే కాజల్ ఫుల్ ఎమోషన్ అయిపోయింది. దీనితో ఆమె బాధను చూడలేని షణ్ముఖ్ కాజల్ కే లెటర్ ఇచ్చారు.

ఈ సందర్భంలో ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేక తన అమ్మ గురించి ఒక నిజం అందరికీ చెప్పేశాడు. షణ్ముఖ్ వల్ల అమ్మకు క్యాన్సర్ వ్యాధితో ఉందట. అందుకోసం ఆమె ఎలా ఉందో తెలుసుకోవాలని ఎంతో మధనపడిపోయాడు. అమ్మ నువ్వే నాకు స్ఫూర్తి అంటూ బాధపడి పోయాడు. ఇది తెలిసిన ప్రేక్షకులు అంతా ఇంత బాధపెట్టుకుని అంతా సంతోషంగా ఎలా ఉన్నావ్ షన్నూ అంటూ సపోర్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: