ఈ మధ్య కాలంలో అయితే ఏ ఛానల్లో చూసినా 10 సీరియల్స్ కంటే ఎక్కువ గానే ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఒకప్పుడు కేవలం ఒక సీరియల్ మాత్రమే ప్రసారం అయ్యేది. ఇక ఆ ఒక్క సీరియల్ కోసం ప్రేక్షకులంతా వారాంతం ఎదురు చూసే వాళ్ళు. ఇప్పుడు మాత్రం పదుల సంఖ్యలో సీరియల్ వస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ టీవీ లో 1998వ సంవత్సరం నుండి 2021 సంవత్సరం వరకు ఈటీవీ లో ప్రతి రోజు రాత్రి 7:30 గంటలకు ప్రేక్షకులను అలరించిన ఈ సీరియల్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం..


1998వ సంవత్సరం లో "మనసు గీసిన బొమ్మ " అనే సీరియల్ సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 7:30 గంటలకు ఈటీవీలో ప్రసారం అయ్యేది. నిరోషా, పృథ్వీరాజ్, భాను చందర్ తదితరులు నటించేవారు.కొన్ని నెలల తర్వాత నిరోషా, పృథ్విరాజ్ తదితరులు "నందిని" సీరియల్ లో నటించారు. తిరిగి అదే సంవత్సరంలో  రాధిక కీలక పాత్రలో "ఇది కథ కాదు" అనే  సీరియల్ ప్రసారమైంది. ఇక ఈ సీరియల్ 550 భాగాలుగా  ప్రసారమైంది. కొన్నాళ్ళు గురువారం వరకూ ఆ  తర్వాత శుక్రవారం వరకు ఈ సీరియల్ ను  ప్రసారం చేశారు.

2001లో "అక్క చెల్లెలు " అనే సీరియల్ స్టార్ట్ కాగా అందులో శ్రీవిద్య , ప్రగతి, అశ్విని, భావన తదితరులు నటించారు. ఇక అదే సంవత్సరం రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిన్న పిల్లలను ఆకట్టుకోవడానికి "మనోయజ్ఞం " అనే సీరియల్ ను  మొదలుపెట్టారు. సమీర్, ఝాన్సీ , రాజ్ కుమార్ తదితరులు ఈ సీరియల్లో నటించారు. 2002లో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన "వదిన" సీరియల్ ప్రారంభమైంది. ఈ సీరియల్ లో ఇంద్రజ, ఏడిద శ్రీరామ్, సుధాకర్ తదితరులు నటించి మెప్పించారు.


2003లో ఇదే సమయానికి "జయం" సీరియల్  ను ప్రసారం చేయగా.. 2005లో "నాతిచరామి" మొదలైంది. 2006లో "గీతాంజలి" స్టార్ట్ కాగా, 2007లో "చంద్రముఖి" అనే సీరియల్ మొదలు పెట్టారు. 2008 లో "మనసు చూడతరమా" అనే సీరియల్ ప్రసారం కాగా, 2009లో బాంధవ్యాలు అనే సీరియల్ ప్రసారమైంది. ఇక అదే సంవత్సరం "తూర్పు వెళ్ళే రైలు" సీరియల్ ప్రసారం కావడం ..2013 వరకు ఇదే సీరియల్ కొనసాగింది. ఇక 2013 నుంచి ఇప్పటి వరకు "మనసు మమత" సీరియల్ కొనసాగుతోంది. ఇక ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు ఈటీవీలో ప్రసారం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: