అనగా ఈ గణాంకాల ప్రకారం కాజల్ మరియు మానస్ ల ఓటింగ్ శాతాలు తక్కువగా ఉండగా వీరిద్దరూ డేంజర్ జోన్ ఉన్నారు. అయితే మానస్ కి కొంచం ఎక్కువగా ఓట్లు పడగా పూర్తిగా లీస్ట్ లో ఉన్నది కాజల్ నే అని తెలుస్తోంది. కాగా ఈ లెక్కల ప్రకారం ఈ వారం హౌజ్ నుండి అసలు బయటకు వెళ్లాల్సింది కాజల్ నే. అయితే దీనికి సంబందించిన బిగ్ బాస్ లీక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షో ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలను నమ్మద్దు అని చెబుతున్న ప్రతిసారి అవే వస్తుండడంతో ప్రజలు నమ్ముతూ వస్తున్నారు.
అయితే ఈ లీక్స్ ని కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేసేందుకే లాస్ట్ టైం రవిని ఎలిమినేట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇపుడు అదే తరహాలో అందరూ ఈ వారం బయటికి వెళ్తుంది అన్న కాజల్‌ని హౌస్ లోనే ఉంచి ఈ వారం షణ్ముఖ్ ను ఎలిమినేట్ చేయడానికి బిగ్‌బాస్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.