ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉండేవారు.. ఎంత తొందరగా ప్రేమలో పడతారో అంతే తొందరగా విడి పోతూ ఉంటారు. గ్లామర్ ఫీల్డ్ అంటే ఇలానే అయిపోయేలా చేస్తున్నారు.. కొంతమంది నటీనటులు. ప్రస్తుత కాలంలో ఎంతోమంది వరుస బ్రేకప్ లు చెబుతూ ఇండస్ట్రీలో వారందరికీ షాక్ ఇస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు ఎక్కువగా బయటపడుతూ ఉన్నాయి.

అలా ఇప్పటివరకు నాగచైతన్య- సమంత, ధనుష్- ఐశ్వర్య, దీప్తి సునయన- షణ్ముఖ్ ఇక వీరే కాకుండా ఎంతోమంది కూడా ఆ మధ్య బ్రేకప్ స్టోరీ లు పోస్ట్ చేసి విడిపోతున్నామని తెలియజేయడం జరిగింది.. అంతేకాకుండా ఈ సెలబ్రిటీస్ జోడీలు ముందుగా తమ ఇంస్టాగ్రామ్ లో తమ వాళ్లకు సంబంధించి ఇంస్టాగ్రామ్ లను అన్ ఫాలో  చేసి.. ఆ తర్వాత వీరిద్దరి మధ్య బ్రేకప్ తెలియజేస్తూ ఉన్నారు. తాజాగా ఇప్పుడు మరొక నటి హిమజా కూడా తన భర్త ని ఫాలో చేయడం లేదని చెప్పడం తో ఇలాంటి విషయం మళ్ళీ బయటికి వచ్చింది.
నటి హిమజ తన భర్తతో త్వరలోనే బ్రేకప్ చెప్పబోతోంది అని వార్తలు బాగా వేగంగా మారుతున్నాయి.. వాస్తవానికి నటి హిమజకు వివాహమైందని విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఇక ఈమె బిగ్ బాస్ లో కానీ.. మన యూట్యూబ్ ఛానల్ లో కానీ ఎప్పుడూ తన భర్త గురించి తెలియజేయలేదు. తరచూ తన పేరెంట్స్ ని మాత్రమే తెలియజేస్తూ ఉంటుంది.. తాజాగా కొద్దిరోజుల కిందట ఒక ఖరీదైన కారు కొన్న విషయాన్ని తెలియజేసింది.. ఇప్పుడు తన డూప్లెస్ హౌస్ నిర్మించుకుంటున్నానని  తాజాగా ఒక వీడియో రూపంలో తెలియజేసింది. అది కూడా తన తల్లిదండ్రుల కోసం నిర్మిస్తున్నాను అని తెలియజేసింది.అక్కడ కూడా తన భర్త గురించి తెలియజేయలేదు. అయితే 2012వ సంవత్సరంలో రాజేష్ ఆనంద్ అనే ఒక బిజినెస్ మాన్ ను వివాహం చేసుకుందని గూగుల్ సమాచారం ప్రకారం తెలుస్తోంది.. కానీ అతన్ని విడిచి పెట్టి ఆ తర్వాత విజయ రెడ్డి ని వివాహం చేసుకుంది. కానీ ఇప్పుడు హిమజా - విజయ్ రెడ్డిలు సోషల్ మీడియాలో ఫాలో చేసుకోకపోవడంతో వీరిద్దరు విడిపోతున్నారనే వార్త బాగా వైరల్ గా మారుతోంది. మరి ఎంత వరకు నిజం అనే విషయం తెలియాలి అంటే హిమజా నోరు విప్పే వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: