మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్స్ లలో కార్తీక దీపం ఒకటి. ప్రేక్షకుల మదిని గెలుచుకుని నెంబర్ వన్ సీరియల్ గా కొనసాగుతున్న ఈ సీరియల్ ను ఇపుడు ఆపేయండి అంటూ దీప, కార్తిక్ ల ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ సీరియల్ లో వంటలక్కగా దీప పాత్ర, అలాగే డాక్టర్ బాబుగా కార్తిక్ పాత్ర ప్రేక్షకుల మనసులోకి కాదు డైరెక్ట్ గా మైండ్ లోకే ఇంజెక్ట్ అయిపోయాయి. కాగా ఇపుడు ఈ పాత్రలకు ముగింపు పలుకుతూ దీప , కార్తిక్ పాత్రలను చంపేశారు. అయితే ఇపుడు వారి పిల్లల పాత్రలను కొనసాగిస్తూ లవ్ ట్రాక్ ను ఎంటర్ చేశారు. అయితే ఈ యాంగిల్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ దీప, కార్తిక్ పాత్రలకు ఫుల్ గా కనెక్ట్ అయిపోయిన ప్రేక్షక జనాలు దీప, కార్తిక్ లు లేని కార్తీకదీపం సీరియల్ ను చూడలేకపోతున్నాము ఈ సీరియల్ ను వెంటనే ఆపేయండి అంటూ నినాదాలు చేస్తున్నారు.
పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఇదే మాట అంటుండడంతో ఈ సీరియల్ లో మళ్ళీ దీప , కార్తిక్ ల పాత్రలను తిరిగి ప్రవేశ పెడతారేమో అని వినపడుతున్నాయి. వారు చనిపోవడం చూపించలేదు కాబట్టి.. యాక్సిడెంట్ తరవాత కోమాలో ఉండి ఇన్నాళ్టికి మళ్ళీ తిరిగి సీరియల్ లోకి ఎంట్రీ ఇస్తారేమో అని సమాచారం. మరి సీరియల్ ఏ మలుపు తిరుగుతుంది అన్నది చూడాలి.