బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ఇండియాలో తెలియని ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఈ షో అన్ని భాషలలోనూ ప్రసారం అయ్యి బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఇక తెలుగులోనూ గత 5 సీజన్ లుగా బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యి... ప్రస్తుతం ఆరవ సీజన్ జరుగుతోంది. హౌస్ లోకి 21 మంది సభ్యులు ప్రవేశించగా, గత వారం ఎలిమినేట్ అయిన నేహాతో కలిపి మొత్తం ముగ్గురు ఇంటి సభ్యులు బిగ్ బాస్ సీజన్ నుండి వెళ్లిపోయారు. అలా ఇప్పుడు కేవలం మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. కాగా ఇపుడిప్పుడే హౌస్ లో హీట్ క్రియేట్ అవుతోంది. ఒకరికోసం ఒకరు కాకుండా గేమ్ కోసం అందరూ కష్టపడి ఆడుతున్నారు.

అయితే బిగ్ బాస్ మొదలైన నాటి నుండి ఈసారి బిగ్ బాస్ ను ఎవరు గెలుచుకుంటారు అన్న విషయం గురించి ఊహాగానాలు జరగడం తెలిసిందే. అయితే అన్ని సార్లు ఊహలు నిజం కావు, అయితే ఇంట్లో ఉన్న సభ్యులకన్నా ఎవ్వరు అయితే బాగా ఆడుతారో వారే చివరికి విజేతగా నిలుస్తారు. ఇక షో మొదలయ్యి మూడు వారాలు గడిచిపోయాయి. కాగా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన సీజన్ లలో విజేతలు అంతా కూడా మగవారు కావడం విశేషం. కానీ ఈసారి మహిళల ఆశ తీరేలా ఉంది. కొన్ని మీడియా ఛానెల్ లు మరియు వెబ్ సైట్ ల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం మహిళే బిగ్ బాస్ విన్నర్ కానుందని తెలుస్తోంది. హౌస్ లో ఉన్న మహిళల్లో గీతు, కీర్తి, శ్రీ సత్య, ఆరోహి, ఫైమా, పింకీ, వాసంతి , ఇనయ లు ఉన్నారు.  

వీరిలో చాలా సాలిడ్ గా మాట్లాడే, ఆడే వారిలో ముగ్గురు ఉన్నారు, వారిలో గీతు, ఇనయ, ఆరోహి లు ఉన్నారు. కాగా వీరిలో ఇనయ మరియు గీతులు ఒకే రకానికి చెందినవారు అని చెప్పాలి. ఇద్దరికీ ఒకే ఫైటింగ్ స్పిరిట్ ఉంది. అయితే తన యొక్క ఎక్స్ట్రా ఆక్టివ్ నెస్ తో గీతు ప్రేక్షకుల్లో చులకన అయిపోతోంది. ఈ విషయం తాను గమనించకపోతే త్వరలోనే ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తన నెగిటివ్ లను అణగదొక్కుకుని ఆదిట్ఠే మాత్రం విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇనయ సులతన సైతం అంతే ఫైర్ కల్గిన కంటెస్టెంట్ అని చెప్పాలి. తనకు హౌస్ లో ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా ఒంటరిగా ఆడుతూ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంటోంది. ఓటింగ్ లోనూ రేవంత్ తర్వాత స్థానంలో ఇనయ సుల్తానా ఉంది. ఇలాగే ఆదిహ్ట్ ఇనాయకు కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇది కేవలం ఒక ప్రిడిక్షన్ మాత్రమే నిజం అవ్వాలని కోరుకుందాం.  





మరింత సమాచారం తెలుసుకోండి: