జబర్దస్త్ ద్వారా ఎంతో మంది గుర్తింపు సంపాదించుకున్న వారు అటు వెండితేరను ఇటు బుల్లితెరను బాగా ఏలేస్తున్నారని చెప్పవచ్చు. అలాంటివారి లో జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పవిత్ర కూడా ఒకరు. ఇక జబర్దస్త్ లో ఇమే అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకొని పలు షో లలో నటిస్తూనే ఉన్నది. అలా ఈటీవీలో ప్రసారమయ్యే పలు షోలలో కూడా చేస్తూ ఉన్నది. కమెడియన్ పవిత్ర. ఇక ఇప్పటికీ కూడా పలు షో లలో నటించి మంచి పేరు సంపాదించుకుంటోంది. ఇక ఏదైనా ఫెస్టివల్, ఈవెంట్స్ లో స్పెషల్ షోలలో కూడా అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది పవిత్ర.

ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ సెలబ్రిటీ హోదాను అందుకుంది పవిత్ర. ప్రస్తుతం ఖరీదైన ఇల్లు కారు కొనుగోలు చేసి సెలెబ్రెటీగా బాగా గుర్తింపు సంపాదిస్తోంది. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు పలు సీరియల్స్ లో కూడా నటించింది. ఇలా గుర్తింపు రాకపోవడంతో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసినప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తన కారుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.



ఇక ఆకారు ధర సుమారుగా రూ.10 లక్షల రూపాయలు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈమె కొన్న కారు విషయానికి వస్తే హుందాయి i -20 మోడల్ కారును కొనుగోలు చేసినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ఇందుకు  సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. జబర్దస్త్ కమెడియన్ గా పలు స్కిట్లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఏది ఏమైనా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే పవిత్ర ఇల్లు కారు కొనడం అభిమానులకు కాస్త సంతోషాన్ని ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: