బిగ్ బాస్ సీజన్ 6 లో రాత్రి పూర్తి అయిన డబల్ ఎలిమినేషన్ ఎపిసోడ్ తో సక్సెస్ ఫుల్ గా పదివారాలను పూర్తి చేసుకుంది. శుక్రవారం రోజుకు హౌస్ లో 12 మంది సభ్యులు ఉండగా ఇద్దరు ఎలిమినేట్ అయిపోయి కేవలం 10 మంది మాత్రమే హౌస్ లో మిగిలారు. నిన్న ఎపిసోడ్ లో నాగార్జున ఇప్పటి వరకు ఆడింది ఒక ఎత్తు.. ఇక ఆడబోయేది మరో ఎత్తు అంటూ కొన్ని స్ఫూర్తి మాటలు చెప్పి... ఈ సీజన్ విన్నర్ గెలుచుకునే ప్రైజ్ మనీని పరిచయం చేశాడు. ఎప్పటిలాగే ఈ సీజన్ లోనూ విన్నర్ 50 లక్షలు బహుమతిగా గెలుచుకుంటాడు. అస్సలు ఫైనల్ వీక్ వరకు వెళ్లాలంటే టాప్ 5 లో ఖచ్చితంగా నిలవాల్సిందే.

గత వారం ఎలిమినేట్ అయిన బాలాదిత్య మరియు వాసంతి లను వదిలేస్తే... ఇది హౌస్ లో ఉన్నది... రేవంత్ , రోహిత్, శ్రీహన్ , ఆదిరెడ్డి , రాజ్ , ఫైమా, మెరీనా , కీర్తి , శ్రీసత్య , ఇనాయ లు ఉన్నారు. వీరిలో దాదాపుగా అందరూ టాప్ 5 కు చేరుకునే అర్హత ఉన్నవారు అని చెప్పాలి. కానీ చిన్న చిన్న పొరపాట్ల కారణంగా అయిదు మంది మాత్రం టాప్ 5 కు రీచ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక మొదటగా టాప్ కు వెళ్లేవారు ఎవరన్నది తెలిస్తే ఆటోమేటిక్ గా ఎవరు వెళ్ళరు అన్నది క్లియర్ గా అర్ధమవుతుంది. ముందుగా ఫస్ట్ వీక్ నుండి ఈ సీజన్ విన్నర్ ఇతనే అని చెప్పుకుంటున్న రేవంత్ టాప్ 5 లో ఉంటాడు. ఇతను ఆడుతున్న తీరు , ఆటలో చూపించే అగ్రెస్సన్, డెడికేషన్ ఇవన్నీ ఇతన్ని టాప్ 5 కు   చేరుస్తాయన్న నమ్మకం అందరిలోనూ ఉంది.

కానీ ఆవేశంలో మాటతీరు మార్చుకోకపోతే మాత్రం ఇప్పటి వరకు అసరిస్తూ వచ్చిన అభిమానులు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక రేవంత్ తో పాటుగా శ్రీహన్ , రోహిత్, ఫైమా మరియు ఇనాయాలు టాప్ లో ఉండే అవకాశం ఉంది. అయితే ఇది ఇప్పటి వరకు ఊహిస్తున్నది మాత్రమే... ఈ నాలుగు వారాలలో అద్భుతంగా ఆడినవారు స్థానాలు మార్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: