తెలుగు బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్నప్పటికీ..యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా ఎన్నో సంవత్సరాలుగా బుల్లితెరపై యాంకరింగ్ గా కొనసాగిస్తూ తన హవా కొనసాగిస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో సినిమాల మీద మక్కువతో పలు చిత్రాలలో కూడా నటించింది సుమ. సుమ భర్త రాజీవ్ కనకాల కూడా పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఉన్నారు. సుమ అంటే బుల్లితెరపై ఒక బ్రాండ్ గా ఇమేజ్ను సెట్ చేసుకుంది. ఎలాంటి ఈవెంట్ అయినా సరే తన మాటలతోనే అక్కడ మేనేజ్ చేయగల సత్తా సుమలో ఉన్నదని చెప్పవచ్చు. పలు చిత్రాలలో పాటలు కూడా పాడింది సుమ. ఇక గతంలో కూడా కొన్ని సినిమాలలో కూడా నటించినట్లు వార్తలు వినిపించాయి.

అంత బిజీగా ఉండే సుమ రీసెంట్గా ఒక షోలో పలు కామెంట్లు చేయడంతో పెను సంచలనం రేపుతోంది. అయితే త్వరలోనే సుమ యాంకరింగ్ కొద్ది రోజులపాటు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈమె బ్రేక్ తీసుకోవట్లేదని చూస్తుంటే పూర్తిగా యాంకరింగ్ గుడ్ బై చెప్పబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఎందుకంటే సుమ భర్త రాజీవ్ కనకాల ఎప్పుడు హెల్త్ అసలు బాగోలేదని ఒక భయంకరమైన జబ్బుతో ఇబ్బంది పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం బయటికి రానివ్వకుండా మెయింటైన్ చేస్తోంది అనే వార్తల కూడా వినిపిస్తున్నాయి.


దీంతో పలువురు అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇదంతా కేవలం ఎవరో సృష్టించిన విషయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది సుమ 31 గుడ్ బై చెప్పి ఒకటవ తేదీ కనిపించే రకమంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై కూడా సుమ స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది.మరి రాబోయే రోజుల్లో సుమ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: